Microgreen: పోషకాల భాండాగారం ఈ మైక్రో గ్రీన్స్... ఈ చిన్నారులు చేస్తున్నపనికి ఫిదా
కరోనా కష్టకాలంలో ప్రారంభమైన ఈ మంచి పనికి ఇప్పుడు డబ్లిన్ నగరపాలకుల మద్దతు లభించటం విశేషం. ఐర్లండ్ రాజధాని డబ్లిన్. మొదటి ముప్పై ప్రపంచ స్థాయి నగరాల్లో ఇదొకటి. సమకాలీన విద్యకు, కళలకు, పరిపాలనకు, పరిశ్రమలకు కేంద్ర బిందువు. ఈ చారిత్రక నగరం బ్రిటిష్ సామ్రాజ్యంలో కొంతకాలం పాటు రెండో అతిపెద్ద నగరంగా విలసిల్లింది.
డిగ్రీ అర్హతతో 1,876 ఎస్సై ఉద్యోగాలు... వయసు, జీతం.. మిగిలిన పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
1922లో దేశ విభజన తర్వాత ‘ఐరిష్ ఫ్రీ స్టేట్’ రాజధానిగా మారింది. తర్వాత ఈ దేశం పేరు ఐర్లండ్‌గా మార్చారు. అర్జున్ కరర్–పరేఖ్, మరో నలుగురు డబ్లిన్ హైస్కూల్ విద్యార్థులు తమ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉండే పిల్లల పౌష్టికాహార భద్రత గురించి పరితపిస్తుంటారు. ఆ పిల్లలకు మంచి ఆహారాన్ని కొని లేదా విరాళంగా సేకరించి పంపిణీ చేయకుండా పోషకాల గనులైన మైక్రోగ్రీన్స్ (ట్టి మొక్కలు)ను స్వయంగా పండిం ఇస్తుండటం విశేషం. ఐదారు అంగుళాల ఎత్తులోనే ఆకుకూరలను కత్తిరించి పచ్చగానే సలాడ్‌గా మైక్రోగ్రీన్స్‌ను తింటే పౌష్టికాహార లోపం తీరుతుంది.
Success Story: సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి... స్టాండప్ కమెడియన్‌గా అదరగొడుతున్న ఐఐటీ విద్యార్థి... ఇతని ఆదాయం ఎంతో తెలుసా..?
సాధారణ ఆకుకూరల్లో కన్నా ఇందులో పోషకాలు చాలా రెట్లు అధికంగా ఉంటాయి. అందువల్ల సాధారణ ఆహారంతో పాటు కొద్ది గ్రాముల మైక్రోగ్రీన్స్ తీసుకుంటే పౌష్టికాహార లోపం తీరుతుందని నిపుణులు చెబుతున్నారు. నాలుగేళ్ల క్రితం అర్జున్ తన 16వ ఏట లైసెన్స్ తీసుకొని మరీ తమ గ్యారేజ్‌లో వర్టికల్ గార్డెన్ ట్రేలను ఏర్పాటు చేసి మైక్రోగ్రీన్స్ పెంపకాన్ని ప్రారంభించాడు.
Success Story: అనారోగ్యంతో భర్త చనిపోయాడు... ఆయన చివరికోరికే నన్ను 51 ఏళ్లలో ప్రభుత్వ ఉద్యోగం సాధించేలా చేసింది
‘గార్డెనర్స్ ఆఫ్ గెలాక్సీ (జీజీ)’ పేరిట తొలుత వ్యాణిజ్య సంస్థగా ప్రారంభింనప్పటికీ తదనంతరం లాభాపేక్ష లేని సంస్థగా మార్చాడు. జీజీ బృందంలో అతనితో పాటు నీల్ కరర్–పరేఖ్, ప్రెస్టన్ చియు, నికో సింగ్ ఉన్నారు. ఈ బృందానికి అర్జున్, నీల్‌ల తల్లి వీణ దేవరకొండ అండగా ఉన్నారు. తాము పెంచిన మైక్రోగ్రీన్స్‌ను డబ్లిన్ యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్ (డీయూఎస్‌డీ) పరిధిలోని స్కూల్ పిల్లలకు, ఆకలితో బాధపడే పేదలు తలదాచుకునే స్థానిక షెల్టర్లకు విరాళంగా అందిస్తున్నారు.
Banks Working Days: ఎల్ఐసీలాగే ఇకపై బ్యాంకులకు 5 రోజులే వర్క్... ఎప్పటినుంచంటే...!
కోతకు సిద్ధమైన మైక్రో గ్రీన్స్
నానబెట్టిన విత్తనాలను ట్రేలలో కొబ్బరిపొట్టు ఎరువులో చల్లి, 9–12 రోజుల తర్వాత ఐదారు అంగుళాల ఎత్తు పెరిగిన బఠాణీ తదితర రకాల మైక్రోగ్రీన్స్‌ను శుభ్రమైన కత్తెర్లతో కత్తిరించి, పేపర్ బ్యాగ్స్‌లో పెట్టి పంపిణీ చేస్తున్నాం. ఈ పనులను మొదటి రెండేళ్లు నేనే చేసేవాడిని. తర్వాత మిగతా వారిని చేర్చుకున్నాను’ అంటున్నాడు అర్జున్.