Skip to main content

Covid Effect in China : మృతదేహాలతో భారీ క్యూ.. అంత్యక్రియల కోసం గంటల తరబడి..

చైనాలో కరోనా కొత్త వేరియంట్‌ బీఎఫ్‌7 విజృంభిస్తోంది. రోజుకు లక్షల మందికి సోకుతోంది. వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచానికి కేసులు, మరణాలు తెలియనీయకుండా డ్రాగన్‌ ప్రభుత్వం కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నా.. సోషల్‌ మీడియాల్లో బయటపడుతున్న వీడియోలు హృదయాలను కలచివేస్తున్నాయి.

వందల మంది మరణిస్తుండడంతో శ్మశానాల ముందు అంత్యక్రియల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులు తలెత్తాయి.

New Variant BF7 : ఈ కొత్త వేరియంట్‌తో వీరికే ముప్పు ఎక్కువ‌.. ఎందుకంటే...?

హృదయవిదారక..

covid in china


ఆరోగ్య నిపుణులు ఎరిక్‌ ఫైగిల్‌ డింగ్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. అందులో తమ వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు పెద్ద క్యూలైన్లో నిలుచుని మృతదేహాలను తీసుకెళ్తున్న హృదయవిదారక వీడియో వైరల్‌గా మారింది. ‘శ్మశానవాటికల్లో పెద్ద క్యూలైన్లు ఉన్నాయి. మీ ప్రియమైన వారి అంత్యక్రియల కోసం క్యూలైన్లలో వేచి ఉండటమే కాదు, ఆ సమయంలో వారిని మోసుకెళ్లాల్సి వస్తుందని ఊహించుకోండి. భయంకరమైన కోవిడ్‌ 19 చైనాను చుట్టివేయడంపై సానుభూతి చూపుదాం.’ అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ నుంచి ఓ డాక్యుమెంట్‌ లీక్‌ కావడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డిసెంబర్‌ 1 నుంచి 20 మధ్య దేశంలోని సుమారు 17.56 శాతం మంది 25 కోట్ల మందికి వైరస్‌ సోకింది. రోజుకు లక్షల మంది వైరస్‌ బారినపడుతున్నారు.

Covid Cases: ఒక్కరోజులో 3.7 కోట్ల మందికి కరోనా?

Published date : 26 Dec 2022 07:15PM

Photo Stories