Skip to main content

India-UAE: భారత్‌కు మూడో అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోన్న దేశం?

India-UAE Ministers

భారత పర్యటనలో ఉన్న యూఏఈ విదేశాంగమంత్రి థాని బిన్‌ అహ్మద్‌ అల్‌ జియోదితో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ భేటీ అయ్యారు. న్యూఢిల్లీలో సెప్టెంబర్‌ 23న జరిగిన ఈ సమావేశంలో... ఇరు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలు వంటి పలు అంశాలపై ఇరువురూ చర్చలు జరిపారు. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ)పై ఇరు దేశాలు చర్చలు ప్రారంభించిన నేపథ్యంలో తాజా సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. 2022 మార్చిలో రెండు దేశాలు సీఈపీఏపై సంతకాలు చేసే అవకాశం ఉంది.

మూడో అతి పెద్ద వాణిజ్య భాగస్వామి..

ప్రస్తుతం యూఏఈ భారత్‌కు మూడో అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోంది. 2019–20లో ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు 59 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. యూఏఈకి అమెరికా తర్వాత ఎగుమతులకు అతి పెద్ద భాగస్వామిగా భారత్‌ ఉంటోంది.

చ‌ద‌వండి: భారత ప్రధాని మోదీతో అమెరికా ఉపాధ్యక్షురాలు కమల భేటీ


క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 23
ఎవరు    : యూఏఈ విదేశాంగమంత్రి థాని బిన్‌ అహ్మద్‌ అల్‌ జియోది
ఎక్కడ    : న్యూఢిల్లీ
ఎందుకు : ఇరు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలు వంటి పలు అంశాలపై చర్చలు జరిపేందుకు..

 

Published date : 24 Sep 2021 03:10PM

Photo Stories