India-USA: భారత ప్రధాని మోదీతో అమెరికా ఉపాధ్యక్షురాలు కమల భేటీ
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో సమావేశమయ్యారు. అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్‌లో సెప్టెంబర్ 23న జరిగిన ఈ సమావేశంలో ద్వైపాక్షిక బంధాల బలోపేతం, అమెరికా– భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతం, కోవిడ్ మహమ్మారిపై పోరాటం, సాంకేతిక రంగం, అంతరిక్ష రంగం వంటి పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. భారత్ రావాలని కమలను మోదీ ఆహ్వానించారు. భారత సంతతికి చెందిన కమల అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యాక... ప్రధాని మోదీతో ప్రత్యక్షంగా సమావేశం కావడం ఇదే తొలిసారి.
మోరిసన్‌తో సమావేశం...
ప్రధాని మోదీ సెప్టెంబర్ 23న వాషింగ్టన్‌లో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్‌తో సమావేశమయ్యారు. భారత్–ఆస్ట్రేలియా మధ్య ఆర్థిక సంబంధాలతోపాటు ద్వైపాక్షిక బంధాల బలోపేతం, కోవిడ్–19, రక్షణ, క్లీన్ ఎనర్జీ అంశాలపై చర్చించారు. ఆకస్(AUKUS-ఆస్ట్రేలియా, యూకే, యూఎస్) భద్రతా భాగస్వామ్యం ఏర్పాటైన తర్వాత మోదీ, మోరిసన్ భేటీ కావడం ఇదే తొలిసారి.
చదవండి: ప్రస్తుతం ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం
ఎప్పుడు : సెప్టెంబర్ 23
ఎవరు : అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్
ఎక్కడ : వాషింగ్టన్, అమెరికా
ఎందుకు : ద్వైపాక్షిక బంధాల బలోపేతం, కోవిడ్ మహమ్మారిపై పోరాటం వంటి అంశాలపై చర్చలు జరిపేందుకు...