India-France: ప్రస్తుతం ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు?
జలాంతర్గాముల కొనుగోలు వివాద అంశంలో అమెరికా, ఆస్ట్రేలియాపై కోపంగా ఉన్న ఫ్రాన్స్ ఇకపై ఇండోపసిఫిక్ ప్రాంతంలో భారత్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీతో తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ టెలిఫోన్ ద్వారా చర్చలు జరిపారు. భారత్‌కు ఎటువంటి సాయం అందించేందుకైనా తయారుగా ఉన్నట్లు మాక్రాన్ చెప్పారు.
వివాదం ఇదే..
ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయాల్సిన జలాంతర్గాముల ఆర్డర్‌ను ఆస్ట్రేలియా అర్థాంతరంగా రద్దు చేసింది. వీటికి బదులు అమెరికా నుంచి జలాంతర్గాములు కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. దీంతో ఆగ్రహించిన ఫ్రాన్స్ తన రాయబారులను యూఎస్, ఆస్ట్రేలియా నుంచి వెనక్కుపిలిపించింది. అలాగే ఫ్రాన్స్‌కు సంబంధం లేకుండా యూఎస్, యూకే, ఆస్ట్రేలియాలు ఇండోపసిఫిక్ ప్రాంతంలో ఆకస్(అ్ఖఓ్ఖ )పేరిట కొత్త గ్రూపును ఏర్పరుచుకోవడం కూడా ఫ్రాన్స్ ఆగ్రహానికి కారణమైంది. ఈ నేపథ్యంలో తమకు ఈ ప్రాంతంలో నమ్మకమైన మిత్రదేశం అవసరం ఉందని గ్రహించే భారత్‌ను ఫ్రాన్స్ సంప్రదించిందని నిపుణుల అభిప్రాయం.
చదవండి: ఏ రెండు దేశాల మధ్య నగదు బదిలీ వ్యవస్థను అనుసంధానం చేయనున్నారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత ప్రధాని నరేంద్ర మోదీతో టెలిఫోన్ ద్వారా చర్చలు
ఎప్పుడు : సెప్టెంబర్ 21
ఎవరు : ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్
ఎందుకు : ఇండోపసిఫిక్ ప్రాంతంలో భారత్–ఫ్రాన్స్ కలిసి పనిచేసే అంశంపై చర్చలు జరిపేందుకు...