RBI, MAS: ఏ రెండు దేశాల మధ్య నగదు బదిలీ వ్యవస్థను అనుసంధానం చేయనున్నారు?
ఇందులో భాగంగా భారత్‌లో అమలవుతున్న ఏకీకృత పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ), సింగపూర్‌లోని పేనౌ వ్యవస్థలను అనుసంధానం చేయనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ (ఎంఏఎస్) ఈ ప్రాజెక్టును ప్రకటించాయి. 2022 జులై నాటికి ఈ రెండింటి లింకేజీ అమల్లోకి రాగలదని ఆర్‌బీఐ సెప్టెంబర్ 15న తెలిపింది. భారత్, సింగపూర్ మధ్య సీమాంతర చెల్లింపులకు అవసరమైన మౌలికసదుపాయాల అభివృద్ధిలో యూపీఐ–పేనౌ లింకేజీ కీలక మైలురాయి కాగలదని పేర్కొంది.
చదవండి: యుద్ధ నౌకల తయారీకి నావల్ గ్రూప్‌తో చేసుకున్న సంస్థ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్, సింగపూర్ దేశాల్లో అమలు చేస్తున్న వ్యవస్థలను అనుసంధానం చేయాలని నిర్ణయం
ఎప్పుడు : సెప్టెంబర్ 14
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ (ఎంఏఎస్)
ఎందుకు : భారత్, సింగపూర్ మధ్య సీమాంతర చెల్లింపులకు అవసరమైన మౌలికసదుపాయాల అభివృద్ధిలో భాగంగా...