Skip to main content

Garden Reach Shipbuilders: యుద్ధ నౌకల తయారీకి నావల్‌ గ్రూప్‌తో చేసుకున్న సంస్థ?

సర్ఫేస్‌ నౌకల తయారీకి అనువైన సాంకేతిక సహకారం కోసం మినీరత్న పీఎస్‌యూ.. గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్స్, ఇంజినీర్స్‌(జీఆర్‌ఎస్‌ఈ) తాజాగా నావల్‌ గ్రూప్‌ ఫ్రాన్స్‌తో చేతులు కలిపింది.
GRSE-Naval group Mou

ఈ మేరకు ఒక అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకుంది. దీంతో ఎగుమతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సాంకేతికతో నౌకల తయారీని చేపట్టేందుకు ఇరుసంస్థలు పరస్పరం సహకరించుకోనున్నాయి. యూరోపియన్‌ నౌకాదళ పరిశ్రమలో లీడర్‌గా నిలుస్తున్న నావల్‌ గ్రూప్‌తో జట్టు కట్టడం ద్వారా గోవిండ్‌ డిజైన్‌ ఆధారిత యుద్ధ నౌకలను జీఆర్‌ఎస్‌ఈ రూపొందించనుంది. దేశ, విదేశీ నౌకాదళాలకు అవసరమయ్యే అత్యున్నత యుద్ధనౌకల తయారీని చేపట్టనుంది. వెరసి దేశ, విదేశీ నావికా దళాల కోసం జీఆర్‌ఎస్‌ఈ 100 యుద్ధ నౌకలను నిర్మించనుంది. 1884లో స్థాపితమైన జీఆర్‌ఎస్‌ఈ ప్రధాన కార్యాలయం కోల్‌కతాలో ఉంది.

 

చ‌దవండి: వెస్టర్న్‌ థియేటర్‌ కమాండ్‌ కమాండర్‌గా ఎవరు నియమితులయ్యారు?


క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : నావల్‌ గ్రూప్‌ ఫ్రాన్స్‌తో ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకున్న సంస్థ?
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 12
ఎవరు    : గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్స్, ఇంజినీర్స్‌(జీఆర్‌ఎస్‌ఈ)
ఎందుకు : సర్ఫేస్‌ నౌకల తయారీకి అనువైన సాంకేతిక సహకారం కోసం...

Published date : 13 Sep 2021 03:55PM

Photo Stories