Skip to main content

China Military: వెస్టర్న్‌ థియేటర్‌ కమాండ్‌ కమాండర్‌గా ఎవరు నియమితులయ్యారు?

భారత్‌తో సరిహద్దు బాధ్యతలను చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ మరో ఆర్మీ కమాండర్‌కు అప్పగించారు.
China flag

భారత్‌తో సరిహద్దు బాధ్యతలను చూసే చైనా మిలటరీ (పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ,, పీఎల్‌ఏ) వెస్టర్న్‌ థియేటర్‌ కమాండ్‌కు జనరల్‌ వాంగ్‌ హైజియాంగ్‌(58)ను కమాండర్‌గా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ నియమించినట్లు ఆ దేశ అధికార వెబ్‌సైట్‌ చైనా మెయిల్‌ సెప్టెంబర్‌ 6న వెల్లడించింది. చైనా అధికార కమ్యూనిస్ట్‌ పార్టీ(సీపీసీ)తోపాటు సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌కి కూడా అధ్యక్షుడు జిన్‌పింగే సర్వాధికారి. 2020, మేలో తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దుల్లో భారత్‌తో ప్రతిష్టంభన తలెత్తినప్పటి నుంచి వెస్టర్న్‌ థియేటర్‌ కమాండ్‌కు చైనా నలుగురు కమాండర్లను మార్చింది. గల్వాన్‌ లోయ, పాంగాంగ్‌ సో, గోగ్రా వంటి ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ జరిగినప్పటికీ హాట్‌స్ప్రింగ్స్, డెప్సంగ్‌ వంటి ఘర్షణాత్మక ప్రాంతాల్లో మోహరింపు కొనసాగుతూనే ఉంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : పీఎల్‌ఏ వెస్టర్న్‌ థియేటర్‌ కమాండ్‌ కమాండర్‌గా నియమితులైన వ్యక్తి?
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 6
ఎవరు    : జనరల్‌ వాంగ్‌ హైజియాంగ్‌
ఎందుకు : భారత్‌తో సరిహద్దు బాధ్యతలను చూసేందుకు...
 

Published date : 08 Sep 2021 07:30PM

Photo Stories