European Commission: ప్రధాని మోదీతో ఈసీ చీఫ్ ఉర్సులా ఎక్కడ భేటీ అయ్యారు?
యూరోపియన్ యూనియన్–ఇండియా ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ ఏర్పాటుకు ప్రధాని నరేంద్ర మోదీ, యూరోపియన్ కమిషన్(ఈసీ) అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ అంగీకారం తెలిపారు. భారత్‌లో పర్యటిస్తున్న ఉర్సులా ఏప్రిల్ 25న న్యూఢిల్లీలో మోదీతో భేటీ అయ్యారు. వాణిజ్యం, టెక్నాలజీ, భద్రత వంటి అంశాల్లో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించుకొనేందుకు ఈ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసుకోవాలని వారు నిర్ణయించారు.
GK Science & Technology Quiz: బ్రహ్మపుత్ర నదిలో ప్రయాణించిన అతి పొడవైన కార్గో నౌక?
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో కూడా ఉర్సులా సమావేశమయ్యారు. భారత్, ఈయూ సంబంధాలు మరింత బలపడాలని రాష్ట్రపతి ఈ సందర్భంగా ఆకాంక్షించారు. తర్వాత రైసినా డైలాగ్ కార్యక్రమంలో ఉర్సులా మాట్లాడారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వ్యూహాత్మక వైఫల్యంగా మారుతుందన్నారు.Tourist Visa: ఏ దేశ పర్యాటక వీసాలను భారత్ సస్పెండ్ చేసింది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం
ఎప్పుడు : ఏప్రిల్ 25
ఎవరు : యూరోపియన్ కమిషన్(ఈసీ) అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : యూరోపియన్ యూనియన్–ఇండియా ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ ఏర్పాటు విషయమై చర్చించేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్