Tourist Visa: ఏ దేశ పర్యాటక వీసాలను భారత్ సస్పెండ్ చేసింది?
చైనీయులకు జారీ చేసిన పర్యాటక వీసాలను సస్పెండ్ చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ వాయు రవాణా సంస్థ (ఐఏటీఏ) ఏప్రిల్ 24న ఈ మేరకు వెల్లడించింది. చైనీయులకు జారీ చేసిన పదేళ్ల కాల పరిమితితో కూడిన పర్యాటక వీసాలు కూడా చెల్లబోవని పేర్కొంది. చైనా వర్సిటీల్లో 22 వేల దాకా భారత స్టూడెంట్లు చదువుతున్నారు. కరోనా నేపథ్యంలో 2020లో తిరిగొచ్చిన వాళ్లను నేటికీ చైనా తిరిగి తమ దేశంలో అడుగు పెట్టనివ్వడం లేదు. వారి భవిష్యత్తు దృష్ట్యా సానుభూతితో ఆలోచించాలని చైనాకు భారత్ పలుమార్లు విజ్ఞప్తి చేసింది. విదేశాంగ మంత్రి జై శంకర్ కూడా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో దీన్ని ప్రస్తావించారు. అయినా లాభం లేకపోవడంతో భారత్ తాజాగా వీసాల సస్పెన్షన్ నిర్ణయం తీసుకుంది.
GK National Quiz: పిల్లల కోసం పిల్లల బడ్జెట్‌ను సమర్పించిన రాష్ట్ర ప్రభుత్వం?
16 యూట్యూబ్ చానెళ్లపై కేంద్రం నిషేధం
దేశ భద్రతకు, విదేశీ సంబంధాలకు, శాంతిభద్రతలకు భంగకరంగా మారాయం టూ భారత్, పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే 16 యూట్యూబ్ చానెళ్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. వీటిలో ఎంఆర్‌ఎఫ్ టీవీ లైవ్, సైని ఎడ్యుకేషన్ రీసెర్చ్, తహఫ్ఫుజ్–ఇ–డీన్ ఇండియా, ఎస్‌బీబీ న్యూస్, పాక్ నుంచి పనిచేసే ఆజ్‌తక్ పాకిస్తాన్, డిస్కవరీ పాయింట్, ది వాయిస్ ఆఫ్ ఆసియా తదితరాలున్నాయి.India-Britain: ప్రధాని మోదీతో బ్రిటన్ ప్రధాని బోరిస్ ఎక్కడ సమావేశమయ్యారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : చైనీయులకు జారీ చేసిన పర్యాటక వీసాలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం
ఎప్పుడు : ఏప్రిల్ 24
ఎవరు : భారత్
ఎందుకు : చైనా వర్సిటీల్లో చదువుతున్న భారత స్టూడెంట్ల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తున్న నేపథ్యంలో..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్