Oscar Awards 2023 : ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్‌లో.. ఎంపికైన ఆర్ఆర్ఆర్ సాంగ్ ఇదే.. అలాగే భారత్ నుంచి..
ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ సాంగ్ నామినేట్ అయింది. తాజాగా ఈ జాబితాను ఆస్కార్ నామినేషన్స్ కమిటీ వెల్లడించింది. ‘నాటు నాటు’ పాటను చంద్రబోస్ రాయగా, రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ పాడారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా పని చేశారు. ఈ ఏడాది 95వ ఆస్కార్ నామినేషన్స్‌ను ప్రకటించారు. ఈ ఏడాది మార్చి 13న అవార్డుల ప్రదానం జరగనుంది. ఇండియా నుంచి మరో సినిమా నామినేషన్స్‌లో ఎంపికైంది. డ్యాకుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ది ఎలిఫెంట్ విష్పరర్స్ ఎంపికైంది.
☛ Junior NTR : ఆస్కార్ రేసులో ఎన్టీఆర్.. జాబితాను వెల్లడించిన..
దాదాపు 300 చిత్రాలను..
అత్యుత్తమ ప్రమాణాలను కలిగిన చిత్రాలను ఓటింగ్ ద్వారా ఆస్కార్ మెంబర్స్ తుది జాబితాను ఎంపిక చేశారు. వివిధ భాషల నుంచి దాదాపు 300 చిత్రాలు షార్ట్‌లిస్ట్ చేశారు. రిజ్ అహ్మద్, అల్లిసన్ విలియమ్స్ వ్యాఖ్యాతలుగా కాలిఫోర్నియా వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. ‘లగాన్’ తర్వాత మరో భారతీయ చిత్రం ఆస్కార్ అవార్డుకు నామినేట్ కావడం గమనార్హం. అలాగే డాక్యుమెంటరీ ఫీచర్ కేటగిరిలో షానూక్‌సేన్ ‘ఆల్ దట్ బ్రెత్స్’, డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ విభాగంలో ‘ది ఎలిఫెంట్ విష్పర్స్’ నామినేట్ అయ్యాయి.
ఉత్తమ చిత్రం ఇదే..
☛ అవతార్: ది వే ఆఫ్ వాటర్
☛ టాప్‌గన్: మావెరిక్
☛ ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్
☛ ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్
☛ ఎల్విస్
☛ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
☛ ది ఫేబుల్‌మ్యాన్స్
☛ టార్
☛ ట్రయాంగిల్ ఆఫ్ సాడ్‌నెస్
☛ ఉమెన్ టాకింగ్
☛ Top 10 Indian Movies 2022 : ఈ ఏడాది టాప్ 10 మూవీస్ ఇవే.. అగ్రస్థానంలో మన తెలుగు మూవీ..
ఒరిజినల్ సాంగ్ ఇదే..
➤ నాటు నాటు (ఆర్‌ఆర్‌ఆర్)
➤ అప్లాజ్ (టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్)
➤ హోల్డ్ మై హ్యాండ్ ( టాప్‌గన్: మార్వెరిక్)
➤ లిఫ్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్)
➤ ది ఈజ్ ఏ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
Kantara Oscar: ఆస్కార్ రేసులో కాంతారా
ఉత్తమ సహాయ నటుడు ఈతనే..
☛ బ్రెన్డాన్ గ్లెసన్ (ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్)
☛ బ్రైయిన్ టైరీ హెన్రీ (కాజ్‌వే)
☛ జడ్ హిర్చ్ (ది ఫేబుల్‌మ్యాన్స్)
☛ బేరీ కియోఘాన్ (ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్)
☛ కి హుయ్ క్వాన్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
☛ RRR Movie : ఆర్‌ఆర్‌ఆర్ ఖాతాలో మరో ప్రతిష్టాత్మక అవార్డు.. ఇంకా అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో..
ఉత్తమ సహాయ నటి ఈమె..
➤ ఆంజెలా బాస్సెట్ (బ్లాక్ పాంథర్: వకండ ఫరెవర్)
➤ హాంగ్ చ్యూ (ది వేల్)
➤ కెర్రీ కాండన్ (ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్)
➤ జామీ లీ కర్టిస్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
➤ స్టెఫానీ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
కాస్ట్యూమ్ డిజైన్ నామినేషన్స్ విభాగం నుంచి..
☛ బేబీలాన్ (మ్యారీ జోఫెర్స్)
☛ బ్లాక్‌పాంథర్: వకండా ఫరెవర్ (రూథ్‌కార్టర్)
☛ ఎల్విస్( కేథరిన్ మార్టిన్)
☛ ఎవ్రీథింగ్, ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ (షెర్లీ కురాట)
☛ మిసెస్ హారిస్ గోస్ టు పారిస్ (జెన్నీ బియావాన్)
సౌండ్ నామినేషన్స్‌లో..
☛ ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్
☛ అవతార్: ది వే ఆఫ్ వాటర్
☛ ది బ్యాట్‌మెన్
☛ ఎల్విస్
☛ టాప్ గన్ : మావరిక్
స్క్రీన్‌ప్లే..విభాగంలో.
➤ మార్టిన్ మెక్‌డొనాగ్ (ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్)
➤ డానియెల్ క్వాన్, డానియెల్ స్కీనెర్ట్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
➤ స్టీవెన్ స్పీల్‌బర్గ్, టోనీ కుష్నర్ (ది ఫేబుల్‌మ్యాన్స్)
➤ టడ్ ఫీల్డ్ (థార్)
➤ రూబెన్ ఆస్ట్లాండ్ (ట్రైయాంగిల్ ఆఫ్ సాడ్‌నెస్)
అంతర్జాతీయ వేదికగా ఇప్పటికే ఎన్నో అవార్డులు పొందిన ఈ చిత్రం తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లోనూ మెరిసింది. 80వ గోల్డెన్ గ్లోబ్స్ (Golden Globes) హాలీవుడ్ అవార్డ్స్ సీజన్ కమెడియన్ జెరోడ్ కార్మిచెల్ హోస్ట్‌గా కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లో జరుగుతోంది. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు గెలుచుకోగా.. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఈ అవార్డును అందుకున్నారు. ఇక ‘‘ఆర్‌ఆర్‌ఆర్’’ ఉత్తమ ఆంగ్లేతర చిత్ర విభాగంలోనూ పోటీపడుతోంది. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం హాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ గెలుచుకున్న మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది.
➤ Oscars 2023: ఆస్కార్ షార్ట్‌లిస్ట్‌లో.. పది భారతీయ చిత్రాలు