Nelson Mandela Award: నిమ్‌హాన్స్ ఇన్స్టిట్యూట్‌కు ప్రతిష్టాత్మక నెల్సన్ మండేలా అవార్డు
జాతీయ మానసిక ఆరోగ్య మరియు నరాల శాస్త్ర సంస్థ (National Institute of Mental Health and Neuro Sciences), భారతదేశంలోని ప్రముఖ మానసిక ఆరోగ్య సంస్థ, 2024 సంవత్సరానికి ఆరోగ్య ప్రమోషన్ కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ద్వారా ప్రతిష్టాత్మక నెల్సన్ మండేలా అవార్డును అందుకుంది. ఆరోగ్య ప్రమోషన్‌లో అత్యుత్తమ సేవలందించిన వ్యక్తులు,సంస్థలకు ఈ అవార్డు గుర్తింపుగా లభిస్తుంది.
జెనీవాలో జరిగిన 77వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో నిమ్‌హాన్స్ డైరెక్టర్ ప్రతిమా మూర్తి ఈ అవార్డును స్వీకరించారు.
అవార్డు అందుకున్న ప్రతిమా మూర్తి "ఈ అవార్డు మా గత, ప్రస్తుత విజయాలకు గుర్తింపు మాత్రమే కాదు, శాశ్వతమైన వారసత్వానికి ధృవీకరణ. నిమ్‌హాన్స్ స్థాపన నుంచి మానసిక ఆరోగ్యం, శ్రేయస్సును పెంపొందించడంలో మార్గనిర్దేశం వహిస్తున్నామనేందుకు ఇది నిదర్శనం. ఈ అవార్డు మానసిక ఆరోగ్య సంరక్షణలో మరింత మెరుగుపరచడానికి, అందరికీ మెరుగైన జీవితాన్ని అందించడానికి స్ఫూర్తినిస్తుంది." అన్నారు.
Bruhat Soma: అమెరికా స్పెల్లింగ్ బీలో సత్తాచాటిన తెలుగు విద్యార్థి.. గెలుచుకున్న రూ.41.64 లక్షలు!!
Tags
- National Institute of Mental Health and Neuro Sciences
- NIMHANS
- Nelson Mandela Award
- Health Promotion
- World Health Organization
- Director of NIMHANS
- Pratima Murthy
- Sakshi Education Updates
- Nelson Mandela Award 2024
- Health Promotion Award
- Mental Health Award India
- Global Health Awards 2024
- current affairs about persons
- internationalnews