Bruhat Soma: అమెరికా స్పెల్ బీ విజేత బృహత్ సోమ.. 90 సెకన్లలో 29 పదాలు.. గెలుచుకున్న రూ.41.64 లక్షలు!!
ఏడో గ్రేడ్ చదువుతున్న 12 ఏళ్ల బృహత్ సోమ.. ప్రతిష్టాత్మక స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ–2024లో విజేతగా నిలిచాడు. 90 సెకన్లలో 29 పదాలకు సరైన సమాధానం ఇచ్చి బహుమతిగా 50 వేల డాలర్లు అంటే దాదాపు రూ.41.64 లక్షలు గెలుచుకున్నాడు.
వాషింగ్టన్‌లో మూడు రోజుల పాటు జాతీయ స్పెల్‌బీ చాంపియన్íÙప్ పోటీలు జరిగాయి. 50 రాష్ట్రాల నుంచి 245 మంది విద్యార్థులు పోటీలో పాల్గొన్నారు. 14 రౌండ్ల తర్వాత గురువారం జరిగిన ఫైనల్‌కు 8 మంది చేరుకున్నారు. ఫైనల్‌లో మొదట 30 పదాలకు 29కి సరైన సమాధానం చెప్పిన బృహత్ టై బ్రేకర్‌గా నిలిచాడు. 25 పదాల్లో 21 పదాలకు సరైన సమాధానం ఇచి్చన ఫైజన్ జాకీ మిగిలిన ఆరుగురిని అధిగమించాడు.
లైటెనింగ్ రౌండ్‌లో బృహత్‌తో పోటీ పడలేకపోయాడు. 90 సెకన్లలో 30 పదాల్లో 29 పదాలకు స్పెల్లింగ్‌ను కరెక్టుగా చెప్పి బృహత్ రికార్డు నెలకొల్పాడు. అబ్సీల్ అనే పదం బృహత్‌కు చాంపియన్‌షిప్‌ను అందించింది. 90 సెకన్లలో 20 పదాలకు మాత్రమే సరైన సమాధానం ఇచ్చిన ఫైజన్ రెండో స్థానంలో నిలిచాడు. 25 వేల డాలర్లను గెలుచుకున్నాడు.
Whitley Gold Award: అస్సాం వన్యప్రాణి శాస్త్రవేత్తకు 'గ్రీన్ ఆస్కార్' అవార్డు
ఇక కాలిఫోర్నియాకు చెందిన శ్రేయ్ ఫారిఖ్, నార్త్ కరోలినాలోని అపెక్స్‌కు చెందిన అనన్య ప్రసన్న మూడో స్థానంలో నిలిచారు. చెరో 12,500 డాలర్లను బహుమతిగా అందుకున్నారు. ఫైనల్‌కు చేరిన ఎనిమిది మంది విద్యార్థుల్లో ఐదుగురు భారతీయ సంతతికి చెందినవారు. కాలిఫోర్నియాకు చెందిన 14 ఏళ్ల రిషబ్ సాహా, కొలరాడోకు చెందిన 13 ఏళ్ల అదితి ముత్తుకుమార్ కూడా ఫైనల్‌కు చేరినవారిలో ఉన్నారు.
అమోఘమైన జ్ఞాపకశక్తి..
బృహత్ తండ్రి శ్రీనివాస్ సోమ నల్లగొండ జిల్లాకు చెందిన వ్యక్తి. ఫ్లోరిడాలో స్థిరపడ్డారు. బృహత్‌కు జ్ఞాపకశక్తి ఎక్కువని, భగవద్గీతలో 80 శాతం కంఠతా వస్తుందని అతని తల్లిదండ్రులు తెలిపారు. ‘గెలిచానని ప్రకటించగానే కొన్ని క్షణాలపాటు నమ్మలేకపోయాను. నా గుండె వేగం పెరిగింది. ఆ తరువాత గొప్ప అనుభూతినిచ్చింది’ అని బృహత్ వెల్లడించాడు.
కేవలం 12 ఏళ్ల వయసులో బృహత్ తన ప్రశాంతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడని స్క్రిప్స్ నిర్వాహకులు తెలిపారు. బృహత్‌కు గొప్ప జ్ఞాపకశక్తి ఉందని, అన్ని రౌండ్లలో ఏ ఒక్క పదాన్ని కోల్పోకుండా సమాధానం చెప్పి పదాలను శాసించాడని కొనియాడారు. గతంలోనూ స్పెల్ బీలో పాల్గొన్న బృహత్ 2023లో 74వ స్థానంలో, 2022లో 163 స్థానంలో నిలిచారు. వివిధ అంశాల్లో ఆసక్తి, అభిరుచి ఉన్న బృహత్ అంతకుముందు వర్డ్స్ ఆఫ్ విస్డమ్ బీ, స్పెల్ పండిట్ బీలను కూడా గెలుచుకున్నాడు.
UK's Royal Award: భారతీయ యువ రిక్షా డ్రైవర్‌కి లండన్ ప్రతిష్టాత్మక అవార్డు!
భారత సంతతి విద్యార్థుల హవా..
కాగా, స్పెల్ బీలో భారత సంతతి విద్యార్థుల హవా కొనసాగుతోంది. గత ఏడాది స్పెల్ బీని సైతం భారత సంతతికి చెందిన విద్యార్థి దేవ్ షా గెలుచుకున్నాడు. 2022లో హరిణి లోగాన్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. దేశంలోనే అతిపెద్ద, ఎక్కువ రోజులు జరిగే కార్యక్రమం అయిన స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీని 1925లో ప్రారంభించారు. 1999 నుంచి ఇప్పటివరకు ఇరవై తొమ్మిది మంది భారతీయ సంతతికి చెందిన విద్యార్థులే చాంపియన్లుగా నిలిచారు.