Skip to main content

UK's Royal Award: భారతీయ యువతికి లండన్‌ ప్రతిష్టాత్మక అవార్డు!

ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెచ్‌ జిల్లాకు చెందిన 18 ఏళ్ల ఆర్తీ అనే యువ రిక్షా డ్రైవర్ లండన్‌లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ప్రతిష్టాత్మక అమల్‌ కూన్లీ ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ అవార్డును అందుకుంది.
E-Rickshaw Driver From UP's Bahraich Who Won UK's Royal Award  Amal Coonli Women  Rickshaw driver empowerments Empowerment Award

ఈ అవార్డు బ్రిటిష్‌ స్వచ్ఛంద సంస్థ ప్రిన్స్‌ ట్రస్ట్‌చే స్పాన్సర్‌ చేయబడుతుంది. ఇది ఇంగ్లీష్‌ బారిస్టర్‌ అమల్‌ క్లూనీ పేరు పెట్టబడింది.

ఆర్తీ ప్రభుత్వ ఈ రిక్షా చొరవలో భాగంగా డ్రైవర్‌గా పనిచేసి ఇతర యువతులకు స్ఫూర్తినివ్వడం వల్ల ఈ గౌరవం దక్కింది.

పింక్‌ రిక్షా ఇనిషియేటివ్ అంటే..
2020 సంవ‌త్స‌రంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు రక్షణ, శిక్షణ మరియు స్వావలంబన ద్వారా సాధికారత కల్పించడానికి "మిషన్ శక్తి" పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద "పింక్‌ ఈ రిక్షా" కార్యక్రమం నిర్వ‌హించారు. ఇది మహిళలకు ఈ రిక్షాలు నడపడంలో శిక్షణ ఇచ్చి, ట్రాఫిక్‌ నిబంధనల గురించి వారికి అవగాహన కల్పిస్తుంది. ముఖ్యంగా వితంతువులు, ఒంటరి తల్లులకు ఉపాధి అవకాశాలను పెంచడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం.

Shaw Prize: భారత సంతతి శాస్త్రవేత్తకు ‘షా’ అవార్డు

ఆర్తీ యొక్క ప్రస్థానం ఇదే..
ఆర్తీ 2021లో భారత ప్రభుత్వం పింక్‌ ఈ రిక్షా పథకాన్ని ప్రారంభించినప్పుడు దానిలో చేరడానికి ముందుకు వచ్చింది. ఆమె ఉత్తరప్రదేశ్‌లో మొదటి పింక్‌ ఈ రిక్షా డ్రైవర్‌గా మారింది. చిన్న వయస్సులోనే ఆమె చూపించిన ధైర్యం, సంకల్పం ప్రిన్స్‌ ట్రస్ట్‌ అవార్డుకు దారితీశాయి.

Published date : 29 May 2024 10:57AM

Photo Stories