NASA Award: శ్రీకాంత్ పాణినికి నాసా అవార్డు
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు నగరానికి చెందిన యువ ఖగోళ, భౌతిక శాస్త్రవేత్త సింగం శ్రీకాంత్ పాణిని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) నుంచి అవార్డు అందుకున్నారు.
నూతన ఆవిష్కరణల విభాగంలో ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన శ్రీకాంత్ పాణిని యూఎస్‌ఏ అలబామాలోని హన్స్‌వెల్లేలో జరిగిన కార్యక్రమంలో మార్షల్ స్పేస్ ఫ్‌లైట్ సెంటర్ డైరెక్టర్ జోసఫ్ పా ప్రై చేతుల మీదుగా ఘన సత్కారాన్ని పొందారు.
గుంటూరు నగరానికి చెందిన హిందూ కళాశాల కమిటీ ఉపాధ్యక్షుడు, సాహితీ సమాఖ్య కార్యదర్శి ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ కుమారుడు శ్రీకాంత్ పాణిని నాసాలో కొన్నేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. విశ్వంలోని సుదూర ప్రాంతాలపై పరిశోధనలు చేస్తూ, సరిహద్దులను ఛేదించి సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో ఖగోళ శాస్త్ర పరిశోధలకు గాను తాను అవార్డు అందుకున్నట్లు పురస్కార గ్రహీత శ్రీకాంత్ పాణిని పేర్కొన్నారు.
President Medal: తెలంగాణ హెడ్ కానిస్టేబుల్‌కు రాష్ట్రపతి అవార్డు
Published date : 19 Aug 2024 03:38PM