President Medal: తెలంగాణ హెడ్ కానిస్టేబుల్‌కు రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డు

78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ దేశంలో 1037 మంది పోలీస్, ఫైర్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్, కరెక్షనల్ సర్వీసెస్ సిబ్బందికి గ్యాలంటరీ, సర్వీస్ మెడల్స్ అందించనుంది. ఈ మేరకు అవార్డ్‌ల జాబితాను విడుదల చేసింది.
ఈ జాబితాలో తెలంగాణ పోలిస్ హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు ప్రెసిడెంట్స్ మెడల్ ఫర్ గ్యాలంటరీ (పీఎంజీ) అవార్డ్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. ఈ రాష్ట్రపతి అవార్డ్‌ను దేశం మొత్తంలో ఒకే ఒక్క పోలీస్ అధికారి యాదయ్యకు దక్కుతుంది.
రాష్ట్రంలో ఇషాన్ నిరంజన్ నీలంపల్లి, రాహుల్ చైన్ స్నాచింగ్‌లు, అక్రమ ఆయుధాల సరఫరా చేసేవారు. అయితే వీళ్లిద్దరూ జూన్ 25, 2022న దోపిడీకి పాల్పడ్డారు. ఆ మరుసటి సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్య పట్టుకున్నారు. యాదయ్య నుంచి తప్పించునేందుకు నిందితులు ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో యాదయ్యపై దారుణంగా కత్తితో పలు మార్లు దాడి చేశారు.
అయినప్పటికీ యాదయ్య వెనక్కి తగ్గలేదు. ప్రాణాల్ని ఫణంగా పెట్టి నిందితుల్ని పట్టుకున్నారు. కటకటాల్లోకి పంపారు. తీవ్రంగా గాయపడ్డ యాదయ్య 17 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆయన ధైర్య సహాసాల్ని కేంద్రం కొనియాడింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్యాలంటరీ అవార్డ్‌ను ప్రధానం చేస్తున్నట్లు ప్రకటించింది.
India and Pakistan: యజ్ఞాన్ని తలపించిన భారత్, పాక్ విభజన.. అలా పంచుకున్నారు!