Gurram Jashuva Award: రేపాకకు గుర్రం జాషువా జాతీయ పురస్కారం
Sakshi Education
అభ్యుదయ రచయితల సంఘ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి రేపాక రఘునందన్‌కు ఆంధ్రప్రదేశ్ బహుజన రచయితల వేదిక గుర్రం జాషువా జాతీయ సాహితీ పురస్కారానికి ఎంపిక చేసింది.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన రేపాక తెలుగు, హిందీ భాషల్లో పలు రచనలు చేయడంతోపాటు ప్రతిజ్ఞ (భారతదేశం నా మాతృభూమి) రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు జీవిత చరిత్రను రచించారు. ఆకాశవాణిలో కవితలు, రచనలు అందించడమే కాక పలు పత్రికల్లో ఆయన కవితలు ప్రచురితమయ్యాయి.
Dr. Madina Prasada Rao: విశాఖ పశు వైద్యుడికి ఉత్తమ విస్తరణ అధికారి జాతీయ అవార్డు
Published date : 28 Sep 2023 10:52AM