Skip to main content

Miss America 2024: మిస్‌ అమెరికాగా ఎయిర్‌ఫోర్స్‌ అధికారిణి..!

కొలరాడోకు చెందిన 22 ఏళ్ల మాడిసన్‌ మార్ష్‌ మిస్‌ అమెరికా 2024 అందాల పోటీల్లో విజేతగ నిలిచి కిరీటాన్ని దక్కించుకుంది.
Air Force officer crowned Miss America 2024

ఆమె ఎయిర్‌ఫోర్స్‌ అధికారిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే మిస్‌ అమెరికా టైటిల్‌ గెలుచుకుని చరిత్ర సృష్టించింది. కొలరాడోకు ప్రాతినిధ్యం వహిస్తున్న మార్ష్‌ ఓ పక్కన అధికారిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఈ ఘనత సాధించింది. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా నెటిజన్లతో పంచుకుంది. 

'మీకు ఆకాశమే హద్దు!. మిమ్మల్ని ఆపగలిగే వారే లేరు. రెండు పడవల మీద కాలు వేయలేం అనే వాళ్లకు నా విజయమే ఓ సమాధానం. మీ అభిరుచి ఎంతటి కష్టమైనా తట్టుకుని సాధించేలా చేయగలదు.' అని ఇన్‌స్టాగ్రాంలో రాసుకొచ్చింది మార్ష్‌. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇక మార్ష్‌ మే 2023లో  మిస్‌ కొలరాడో కిరీటం కూడా గెలుచుకుంది. ఆమె ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ నుంచి ఫిజిక్స్‌ పట్టా పొందే కొద్ది రోజుల ముందే ఈ విజయం సాధించింది.

Tulsi Chaitanya: ఏపీ పోలీస్‌ తులసి చైతన్యకు టెంజింగ్ నార్గే అవార్డు..

మార్ష్‌ ఒక పక్క ఎయర్‌ఫోర్స్‌లో రెండవ లెఫ్టినెంట్‌గా కఠినతరమైన బాధ్యతలు చేపట్టడమేగాక మిస్‌ హార్వర్డ్‌ కెన్నెడీ స్కూల్‌లో పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ డిగ్రీని కూడా చేస్తూ..ఈ మిస్‌ అమెరికా అందాల పోటీకి ప్రీపేర్‌ అయ్యింది. నాకు ఇష్టమైన రెండు విభిన్న రంగాలను చేపట్టి సాధించడం చాలా అద్భుతంగా ఉందని అంటోంది మార్ష్‌. 'మీపై మీకు నమ్మకం ఉంటే మిమ్మలని మీరు ఒక్కచోటకే పరిమితం చేయాల్సిన పనిలేదు. ధైర్యంగా అడగు వేయండి.' అని ఆత్మవిశ్వాసంగా చెబుతోంది మార్ష్‌.

ఈ అందాల పోటీకి తాను ఎయిర్‌ఫోర్స్‌లో జాయిన్‌ అయ్యేందుకు తీసుకున్న శారీరక శిక్షణ ఎంతగానో ఉపయోగపడిందని చెప్పుకొచ్చింది. కాగా ఈ మిస్‌ అమెరికా అందాల పోటీల్లో మార్స్‌ మిస్‌ అమెరికాగా కిరీటాన్ని దక్కించుకోగా, టెక్సాస్‌కు చెందిన ఎల్లీ బ్రూక్స్ రన్నరప్‌గా నిలిచింది.

 

 

Published date : 16 Jan 2024 12:10PM

Photo Stories