Skip to main content

TTD : శ్రీ వెంక‌టేశ్వ‌ర గోసంర‌క్ష‌ణ ట్ర‌స్ట్‌లో ఉద్యోగాలు.. చివ‌రి తేదీ ఇదే..

సాక్షి, ఎడ్యుకేష‌న్‌: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న శ్రీ వెంక‌టేశ్వ‌ర గోసంర‌క్ష‌ణ ట్ర‌స్ట్ నందు కాంట్రాక్ట్‌ ప్రాతిప‌దిక‌న ప‌నిచేయుట‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది.
Tirumala Tirupati Devasthanam
Tirumala Tirupati Devasthanam

ముగ్గురు మేనేజ‌ర్లు, ఆరు మంది కాంపౌండ్‌/
డైరీ అసిస్టెంట్లు కావ‌లెను. ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు సంచాల‌కుల వారి కార్యాల‌యం, శ్రీ వెంక‌టేశ్వ‌ర గోసంర‌క్ష‌ణ ట్ర‌స్ట్, చంద్ర‌గిరి రోడ్డు, తిరుప‌తి-517502 చిరునామ‌కు ద‌ర‌ఖాస్తును పూర్తి చేసి ఏప్రిల్ 11వ తేదీ సాయంత్రం 5:00 గంట‌ల‌లోపు పంప‌వ‌లెను. ఏ కార‌ణం చేత‌నైన ద‌ర‌ఖాస్తు ఆల‌స్యంగా వ‌చ్చిన ఎడ‌ల ఎట్టి ప‌రిస్థితుల్లో ద‌ర‌ఖాస్తు స్వీక‌రించ‌బ‌డ‌దు. ఈ  ఉద్యోగాల అర్హ‌త‌లు, ఇత‌ర వివ‌రాల‌కు www.tirumala.org వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

ఇంకా పూర్తి వివ‌రాలు కింది పీడీఎఫ్‌లో చూడొచ్చు..

​​​​​​​

Published date : 01 Apr 2022 01:34PM
PDF

Photo Stories