Skip to main content

Jobs: విశాఖ పోర్టులో 1,112 పోస్టులు ఖాళీలు

న్యూఢిల్లీ: విశాఖపట్నం పోర్టులో మొత్తం సిబ్బంది సంఖ్య 4,003 ఉండగా 1,112 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పోర్టుల శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్‌ వెల్లడించారు.
Visakha port jobs
Visakha port jobs

విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ విశాఖపట్నం పోర్టుతోపాటు దేశంలోని మేజర్‌ పోర్టులలో అనేక ఏళ్ళుగా టెక్నాలజీ, మెకనైజేషన్‌ కారణంగా చోటు చేసుకున్న మార్పుల కారణంగా ప్రైవేట్‌ పోర్టులతో పోల్చుకుంటే మేజర్ పోర్టులలో సిబ్బంది సంఖ్య అవసరమైన దానికంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు మంత్రి చెప్పారు. అందువలన మేజర్‌ పోర్టులలో సిబ్బందిని అవసరం మేరకు మాత్రమే ఉంచాలని నిర్ణయించినట్లు తెలిపారు.

Published date : 14 Dec 2021 06:19PM

Photo Stories