Skip to main content

IT jobs : ఈ బెంగే వద్దు.. పిలిచి మరీ ఉద్యోగాలు ఇస్తున్నారు.. లక్షల్లో..

ఆర్ధిక మాంద్యం భయాలతో అమెజాన్‌, ట్విటర్‌, మెటా, విప్రో, మైక్రోసాఫ్ట్‌ వంటి దిగ్గజ సంస్థలు ఉద్యోగుల్ని ఫైర్‌ చేస్తున్నాయి. రానున్న 18 నెలలు ఉద్యోగులు ఇదే గడ్డు కాలం ఎదుర్కొనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దిగ్గజ కంపెనీల్లో పరిస్థితులు ఇలా ఉంటే మనదేశానికి చెందిన స్టార్టప్స్‌లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.

లక్షల స్టార్టప్‌లలో లక్షల ఉద్యోగాలు ఉన్నట్లు తేలింది. ఆయా స్టార్టప్‌ అవసరాన్ని ఇప్పటికే 2లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. రానున్న రోజుల్లో వాటి సంఖ్య భారీ స్థాయిలో పెరగనుంది. ఆర్థిక సేవల ప్లాట్‌ఫారమ్, స్ట్రైడ్‌వన్ నివేదిక ప్రకారం 2022లో మనదేశానికి స్టార్టప్‌లు 2లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించాయి. స్టార్టప్‌ల ద్వారా ఉద్యోగాల కల్పన 2017-22 మధ్య 78 శాతం వృద్ధి సాధించినట్లు నివేదిక వెల్లడించింది. అదనంగా, దేశ ప్రభుత్వం డిజిటల్‌ ఎకానమీపై దృష్టి సారించడంతో ఉద్యోగాల కల్పన 2025 నాటికి 70 రెట్లు పెంచుతుందని హైలైట్ చేసింది.

Job Layoffs : 2 నెలల్లో 1.25 లక్షల ఉద్యోగాలు తొలగింపు.. భారతీయ టెకీలపైనే ఎక్కువ ప్రభావం..!

ఇండియన్‌ స్టార్టప్‌ ఈకో సిస్టం అమెరికా, చైనా తర్వాత  ప్రపంచ దేశాల్లో మూడవ అతి పెద్ద దేశంగా భారత్‌ అవతరించింది.  పరిశ్రమ, అంతర్గత వాణిజ్యం(ఇంటర్నల్‌ ట్రేడ్‌) విభాగంలో 770,000 పైగా స్టార్టప్‌లు నమోదు చేసుకున్నాయి. 108 యునికార్న్‌లతో కూడిన, స్టార్ట్ అప్‌ల సంయుక్త విలువ $400 బిలియన్లకు పైగా ఉంది.

తద్వారా లక్షలాది మందికి..

it jobs

స్ట్రైడ్‌వన్ వ్యవస్థాపకుడు ఇష్‌ప్రీత్ సింగ్ గాంధీ మాట్లాడుతూ.. స్కేలబిలిటీ, ఆల్టర్నేట్ ఫండింగ్ ఆప్షన్‌లు, గ్లోబల్ మార్కెట్‌లోకి విస్తరించడం వంటి వివిధ అంశాలలో పర్యావరణ వ్యవస్థ పెరుగుదల అనేక అవకాశాలను సృష్టించిందని, తద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పించే సామర్ధ్యాన్ని కూడా పెంచింది. దీంతో భారతదేశ జీడీపీకి సుమారు 4-5 శాతం దోహదపడే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది’ అని చెప్పారు.

Jobs Layoffs 2022 : అస‌లు ఎందుకు ఇంత భారీగా ఉద్యోగాలు ఊడుతున్నాయ్‌.. ఇంకా రానున్న రోజుల్లో ఇది..

Published date : 16 Dec 2022 07:17PM

Photo Stories