Skip to main content

Half Day Offices For Government Employees 2023 : కీల‌క నిర్ణ‌యం.. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు కూడా ఒంటిపూట ప‌ని.. ఎక్క‌డంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఎండ‌కాలంలో ఇచ్చే ఒంటిపూట బ‌డులు.. ఇప్ప‌టి వ‌ర‌కు కేవలం స్కూల్ విద్యార్థుల‌కే ఇస్తుంటారు. ఎందుకంటే.. వేసవిలో పిల్లలకు ఎండల నుంచి ఉపశమనం కల్పించేందుకు విద్యార్థుల‌కు ఒంటిపూట బ‌డి నిర్వహిస్తుంటారు.
Half Day Offices For Government Employees 2023 Telugu News
Half Day Offices For Government Employees 2023 Details

అయితే తాజాగా పంజాబ్ రాష్ట్ర ప్ర‌భుత్వం సంచ‌న‌ల నిర్ణ‌యం తీసుకుంది. స‌రిగ్గా.. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇలాంటి అవ‌కాశాన్ని కల్పించింది. వచ్చే నెల నుంచి ఒంటిపూట ఆఫీసులను ప్రారంభించనుంది. ఈ మేరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్ ఏప్రిల్ 8వ తేదీన‌(శ‌నివారం) ఈ కీలక ప్రకటన చేశారు.

☛ TS Schools Summer Holidays 2023 : స్కూళ్లకు 48 రోజులు సెలవులను ప్రకటించిన ప్రభుత్వం.. అలాగే ఏడాది సెల‌వుల‌ పూర్తి వివ‌రాలు ఇవే..

నేను కూడా ఉదయం 7.30 గంటలకే ఆఫీసుకు వస్తా.. : సీఎం భగవంత్‌ మాన్

సీఎం భగవంత్‌ మాన్

ఆఫీసుల పనివేళలను మార్చడంతో విద్యుత్‌ లోడ్‌ కూడా తగ్గుతుందని ముఖ్య‌మంత్రి అభిప్రాయపడ్డారు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత విద్యుత్‌పై లోడ్‌ అధికంగా ఉంటుందని విద్యుత్‌శాఖ అధికారులు తెలిపారు. ఇప్పుడు ఆఫీసులను 2 గంటలకు మూసివేయడంతో ఆ లోడ్‌ 300 నుంచి 350 మెగావాట్లు తగ్గుతుంది. నేను కూడా ఉదయం 7.30 గంటలకే ఆఫీసుకు వస్తాన‌ని సీఎం భగవంత్‌ మాన్ తెలిపారు.

hot summer 2023

గత కొన్ని రోజులుగా ఎండలు విపరీతంగా మండుతున్నాయి. ఈ ఏడాది వేసవికాలంలో అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఇప్పటికే భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ముఖ్యంగా బిహార్‌, ఝార్ఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల్లో ఏప్రిల్‌, జూన్‌ మధ్య ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగి వేడిగాలులు వీస్తాయని పేర్కొంది.

☛ Students Holidays 2023 : ఈ విద్యార్థులకు 77 రోజులు సెలవులు.. ఎందుకంటే..?

మే 2వ తేదీ నుంచే..

good news for government employees

ప్రభుత్వ కార్యాలయాల పనివేళలు ప్రస్తుతం ఉదయం 9:00 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు కొనసాగుతున్నాయి. అయితే మే 2వ తేదీ నుంచి ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు ఒంటిపూట ఆఫీసుల‌ను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జులై 15 వరకు ఈ కొత్త పనివేళలు అమల్లో ఉంటాయని పంజాబ్ ముఖ్య‌మంత్రి సీఎం భగవంత్‌ మాన్ వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు నిపుణులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

2023 ఏడాదిలో సెల‌వులు పూర్తి వివ‌రాలు ఇవే..

ap schools holidays list 2023

పండుగ/పర్వదినం

తేదీ

వారం

భోగి

14–01–2023

శనివారం

మకర సంక్రాంతి

15–01–2023

ఆదివారం

కనుమ

16–01–2023

సోమవారం

రిపబ్లిక్‌ డే

26–01–2023

గురువారం

మహాశివరాత్రి

18–02–2023

శనివారం

హోలి

08–03–2023

బుధవారం

ఉగాది

22–03–2023

బుధవారం

శ్రీరామనవవిు

30–03–2023

గురువారం

బాబు జగజ్జీవన్‌రామ్‌ జయంతి

05–04–2023

బుధవారం

గుడ్‌ ప్రైడే

07–04–2023

శుక్రవారం

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి

14–04–2023

శుక్రవారం

రంజాన్‌

22–04–2023

శనివారం

బక్రీద్‌

29–06–2023

గురువారం

మొహర్రం

29–07–2023

శనివారం

స్వాతంత్య్ర దినోత్సవం

15–08–2023

మంగళవారం

శ్రీకృష్ణాష్టమి

06–09–2023

బుధవారం

వినాయకచవితి

18–09–2023

సోమవారం

ఈద్‌ మిలాదున్‌ నబీ

28–09–2023

గురువారం

మహాత్మాగాంధీ జయంతి

02–10–2023

సోమవారం

దుర్గాష్టమి

22–10–2023

ఆదివారం

విజయదశమి

23–10–2023

సోమవారం

దీపావళి

12–11–2023

ఆదివారం

క్రిస్‌మస్‌

25–12–2023

సోమవారం

రెండో శనివారం, ఆదివారం వచ్చిన సాధారణ సెలవులు ఇవే..

భోగి

14–01–2023

రెండో శనివారం

మకర సంక్రాంతి

15–01–2023

ఆదివారం

దుర్గాష్టమి

22–10–2023

ఆదివారం

దీపావళి

12–11–2023

ఆదివారం

2023లో ఐచ్ఛిక సెలవులు ఇలా..

కొత్త ఏడాది

01–01–2023

ఆదివారం

హజ్రత్‌ అలీ పుట్టినరోజు

05–02–2023

ఆదివారం

షబ్‌–ఇ–బారత్‌

07–03–2023

శుక్రవారం

మహావీర్‌ జయంతి

04–04–2023

మంగళవారం

షబ్‌–ఇ–ఖాదర్‌

18–04–2023

మంగళవారం

జుమాతుల్‌ వాడ

21–04–2023

శుక్రవారం

బసవజయంతి

23–04–2023

ఆదివారం

షహద్‌ హజ్రత్‌ అలీ

24–04–2023

సోమవారం

బుద్ధపూర్ణిమ

05–05–2023

శుక్రవారం

రథయాత్ర

20–06–2023

మంగళవారం

ఈద్‌–ఇ–గదీర్‌

06–07–2023

గురువారం

9వ మొహర్రం

28–07–2023

శుక్రవారం

పార్సీ నూతన సంవత్సరం డే

16–08–2023

బుధవారం

వరలక్ష్మీవ్రతం

25–08–2023

శుక్రవారం

అర్బయిన్‌ (చాహల్లమ్‌)

05–09–2023

మంగళవారం

హజ్రత్‌ సయ్యద్‌ మహమ్మద్‌ జువాన్‌పురి మెహదీ పుట్టినరోజు

09–09–2023

శనివారం

మహాలయ అమావాస్య

14–10–2023

శనివారం

విజయదశమి (తిధిద్వయం)

24–10–2023

మంగళవారం

యాజ్‌–దహుమ్‌–షరీఫ్‌

26–10–2023

గురువారం

కార్తీకపూర్ణీమ/గురునానక్‌ జయంతి

27–11–2023

సోమవారం

క్రిస్మస్‌ ఈవ్‌

24–12–2023

ఆదివారం

బాక్సింగ్‌ డే

26–12–2023

మంగళవారం

Published date : 08 Apr 2023 07:58PM

Photo Stories