Andhra Pradesh: ఎవ్వరికీ జీతాలు తగ్గలేదు.. ప్రతి ఉద్యోగి వారి జీతాల పెరుగుదలను తెలుసుకునేలా..
ఈ మేరకు సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐఆర్ ఉన్నా.. ఐఆర్ లేకున్నా ఉద్యోగుల జీతం పెరుగుతుంది. ఎవ్వరికీ జీతం తగ్గకూడదని సీఎం చెప్పారు. గత పీఆర్సీ నుంచి ఇప్పటి పీఆర్సీ వరకు చూస్తూ ఎక్కువ పెరుగుదల ఉంది. ఐఆర్‌తో కలిపినా పెరుగుదల ఉంది. ఎవ్వరికీ జీతాలు తగ్గలేదు. ఈ రోజు రాత్రికి అందరికీ జీతాలు వచ్చాక తెలుస్తుంది.
పీఆర్సీకి అదనంగా..
ఉద్యోగులు ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి. వాస్తవానికి ప్రతి ఏటా 15 శాతం ఆదాయం పెరగాలి. పీఆర్సీకి అదనంగా గ్రాట్యుటీ, హౌసింగ్ స్కీమ్ వలన అదనపు ప్రయోజనం ఉంది. ఉద్యోగులంతా ప్రభుత్వంలో భాగం. ప్రతి పీఆర్సీ అప్పుడు చర్చల కమిటీ ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగులు ఏ సమస్య ఉన్నా చర్చించుకుందాం. సమ్మె ఆలోచనను విరమించుకోండి. మనమంతా ఒక కుటుంబం. హెచ్‌ఆర్‌ఏ లాంటివి మాట్లాడుకుందాం రండి. ఉద్యోగులను చర్చలకు రమ్మని కోరుతున్నాను' అని సీఎస్ సమీర్ అన్నారు.
ప్రతి ఉద్యోగి వారి జీతాల పెరుగుదలను తెలుసుకునేలా..
ఆర్థికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్‌ఎస్ రావత్ మాట్లాడుతూ.. ఆర్థిక శాఖ నుంచి ఉద్యోగులను.. మంత్రులు, అధికారులతో చర్చలకు రమ్మని కోరుతున్నాను. ఉద్యోగులకు ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తాం. ఒకటో తేదీన జీతాలు వెయ్యడం ప్రభుత్వ బాధ్యత. 3.69లక్షల సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లకు జీతాలు వేశాము. 1.75 లక్షల ఇతర ఉద్యోగులకు జీతాలు వేశాము. 94,800 ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు, కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు జమచేశాము. 3.3 లక్షల మంది పెన్షనర్లకు జమచేశాము. 3,97,564 రెగ్యులర్ ఉద్యోగుల జీతాలు కూడా వేశాము. వారికి శాలరీ బ్రేక్ అప్ కూడా పంపాము. ప్రతి ఉద్యోగి వారి జీతాల పెరుగుదలను తెలుసుకునేలా బ్రేక్ అప్ ఇచ్చాము అని ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ ఎస్‌ఎస్ రావత్ అన్నారు.
AP High Court: జీతం పడకుండా తగ్గినట్లు మీకు ఎలా తెలుసు.. ?
AP High Court: పీఆర్సీపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Andhra Pradesh: పలు కీలక అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం.. ఉద్యోగుల పీఆర్సీ విషయంలో..
Good News: పీఆర్సీపై సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన..గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు మాత్రం..