Andhra Pradesh: పలు కీలక అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం.. ఉద్యోగుల పీఆర్సీ విషయంలో..
ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. పీఆర్సీ సహా పలు కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉద్యోగులు రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఉద్యోగులకు జగనన్న టౌన్‌షిప్ లలో ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన కేబినెట్.. టౌన్‌షిప్‌లలో 10 శాతం ప్లాట్లు 20 శాతం రిబెట్ తో ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- ఈబీసీ నేస్తం అమలుకు క్యాబినెట్ ఆమోదం
- ఈనెల 25న ఈబీసీ నేస్తం పథకానికి సీఎం జగన్ శ్రీకారం
- 16 వైద్య కళాశాలల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
- ఇప్పటికే ఉన్న 11 వైద్య కళాశాలల అభివృద్ధికి కేబినెట్ ఆమోదం
- వైద్య కళాశాలలకు రూ, 7,880 కోట్లు ఖర్చు చేసేందుకు ఆమోదం
- ప్రస్తుత వైద్య కళాశాలల అభివృద్ధికి రూ. 3,820 కోట్లు కేటాయింపు
- గ్రామీణ ప్రాంతాల్లో వాయిదాల్లో ఓటీఎస్ చెల్లింపునకు ఆమోదం
- రైతుల నుండి ధాన్యం కొనుగోళ్ల కోసం రూ. 5 వేల కోట్లు
- ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో రైతుకు చెల్లింపు
- ఉద్యోగుల నూతన పీఆర్సీకి ఆమోదం
- కోవిడ్‌తో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకం
- అగ్రవర్ణాల పేద మహిళలకు 45 వేలు ఆర్థిక సహాయం
- ఏటా 15 వేలు చొప్పున 45 ఏళ్ళ నుండి 60 ఏళ్ల మధ్య పేద మహిళలకు ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయం
- కిదాంబి శ్రీకాంత్ స్పోర్ట్స్ అకాడమీకి తిరుపతిలో ఐదెకరాల భూమి కేటాయింపు
- విశాఖలో అదాని డేటా సెంటర్‌కు భూ కేటాయింపు ప్రతిపాదనకు ఆమోదం
- వన్ డిస్ట్రిక్ట్-వన్ మెడికల్ కాలేజీ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం
చదవండి: Good News: పీఆర్సీపై సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన..గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు మాత్రం..
ఉద్యోగులతో సంప్రదింపులకు కమిటీ..
ఉద్యోగులతో సంప్రదింపులకు కమిటీ వేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ సమీర్ శర్మలను కమిటీలో సభ్యులుగా చేర్చారు. ఉద్యోగులకు వాస్తవ పరిస్థితులు వివరించి, అపోహలు తొలగించేందుకు ఈ కమిటీ ఏర్పాటు చేశారు.
Andhra Pradesh: జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌ల ప్రధాన ఉద్దేశం?
AP CM YS Jagan: ఏపీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..