Andhra Pradesh: జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌ల ప్రధాన ఉద్దేశం?
నగర, పట్టణ ప్రాంతాల్లోని మధ్య తరగతి వారి సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లు (ఎంఐజీ) ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. తొలి విడతలో గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని నవులూరు, అనంతపురం జిల్లా ధర్మవరం, ప్రకాశం జిల్లా కందుకూరు, వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి, నెల్లూరు జిల్లాలోని కావలి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వద్ద లేఅవుట్లు సిద్ధం చేశారు. వీటి కొనుగోలుకు రూపొందించిన వెబ్‌సైట్ https://migapdtcp.ap.gov.in/ ను జనవరి 11న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు.
పట్టణ నగర పాలక సంస్థల పరిధిలో ఉండే జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లలో ప్లాట్లను రూ.18 లక్షలకంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్నవారికి మాత్రమే కేటాయిస్తారు. మార్కెట్ ధరకంటే ఈ ప్లాట్ల ధరలు తక్కువగానే నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. మొదటి విడతలో 3,894 ప్లాట్లను అన్ని వసతులతో సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్(ఎంఐజీ)లలో ప్లాట్ల కొనుగోలుకు నూతన వెబ్‌సైట్ ప్రారంభం
ఎప్పుడు : జనవరి 11
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : సీఎం క్యాంపు కార్యాలయం, తాడేపల్లి, గుంటూరు జిల్లా
ఎందుకు : నగర, పట్టణ ప్రాంతాల్లోని మధ్య తరగతి వారి సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో..
GK Important Dates Quiz: ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ఎప్పుడు?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్