Skip to main content

AP High Court: జీతం పడకుండా తగ్గినట్లు మీకు ఎలా తెలుసు.. ?

సాక్షి, అమరావతి: పీఆర్సీ జీవోను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఫిబ్ర‌వ‌రి 1వ తేదీన‌ విచారణ జరిపింది.
AP High Court
AP High Court

జీతం పడకుండా తగ్గినట్లు మీకు ఎలా తెలుసు అని హైకోర్టు ప్రశ్నించింది. ‘సమస్య పరిష్కారం కోసం కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు సమ్మె చేయడం అంటే ధర్మాసనంపై అనవసర ఒత్తిడి కలిగించడమే.. ఉద్యోగుల సమ్మెతో సమస్య పరిష్కారం కాదు’ అని హైకోర్టు పేర్కొంది.

ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒక్క రూపాయి కూడా..
కోర్టుకు ఏజీ శ్రీరాం వాదనలు వినిపిస్తూ.. ఉద్యోగులు అనవసర భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒక్క రూపాయి కూడా తగ్గదన్నారు. అత్యున్నతమైన న్యాయస్థానం భావించినట్లే మేము కూడా కోర్టులో పిటిషన్‌కు సంబంధించిన విచారణ నడుస్తున్నప్పుడు సమ్మె చేయటం ప్రయోజనకరం కాదని భావిస్తున్నామని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్‌ కోర్టుకు తెలిపారు.

AP High Court: పీఆర్సీపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Andhra Pradesh: ప‌లు కీలక అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం.. ఉద్యోగుల‌ పీఆర్సీ విష‌యంలో..

Good News: పీఆర్సీపై సీఎం వైఎస్‌ జగన్‌ కీలక ప్రకటన..గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల‌కు మాత్రం..

Published date : 01 Feb 2022 04:55PM

Photo Stories