Skip to main content

Andhra Pradesh : జగనన్న 'సివిల్ సర్వీసెస్' ప్రోత్సాహకం పేరుతో మరో పథకం.. రూ.50 వేల నుంచి లక్ష ఆర్ధిక సాయం..

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సెప్టెంబ‌ర్ 20వ తేదీన‌(బుధ‌వారం) కేబినెట్‌ సమావేశం జరిగింది. ఈ కేబినెట్‌ సమావేశంలో ప‌లు కీలకమైన‌ నిర్ణయాలు తీసుకున్నారు.
Important government decisions,andhra pradesh cabinet meeting today news telugu, Cabinet meeting ,AP Chief Minister YS Jaganmohan Reddy
andhra pradesh cabinet meeting

అలాగే ప‌లు కీలకమైన బిల్లులకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్‌ అమలు బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 

ఈ సంద‌ర్భంగా కేబినెట్ తీసుకున్న ప‌లు నిర్ణయాలు ఇవే.. 

andhra pradesh cabinet meeting today news telugu

☛ ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్‌ అమలు బిల్లుకు ఆమోదం. ఉద్యోగి రిటైర్డ్‌ అయిన సమయానికి ఇంటి స్థలం లేనివారికి కచ్చితంగా ఇంటి స్థలం ఉండాలి. ఇది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలి. రిటైర్డ్‌ అయిన తర్వాత కూడా ఉద్యోగులు, వారి పిల్లలు కూడా ఆరోగ్య శ్రీ కింద అందరూ కవర్‌ అయ్యేలా చూడాలి. వారి పిల్లల చదువులు కూడా ఫీజు రియింబర్స్‌ మెంట్‌ కింద ఉండి ప్రయోజనాలు అందేలా చూడాలి. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. 
☛ జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో మరో పథకం ఏర్పాటుకి కేబినెట్‌ ఆమోదం. సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన వారికి ఈ పధకం ద్వారా లబ్ది, UPSC లో ప్రిలిమ్స్, mains ఉత్తీర్ణత సాధించిన వారికి 50 వేల నుంచి లక్ష ఆర్ధిక సాయం తదితర అంశాలపై చర్చ జ‌రిగింది.
☛ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం. 
☛ ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లుకి ఆమోదం. 
☛ ప్రైవేటు యూనివర్శిటీల చట్టంలో సవరణపై బిల్లుకు ఆమోదం.
☛ ప్రఖ్యాత యూనివర్శిటీలతో సంయుక్త సర్టిఫికేషన్‌ ఉండేలా చట్ట సవరణ. ఇందులో చదువుతున్న విద్యార్థుల డిగ్రీలకు జాయింట్‌ సర్టిఫికేషన్‌. ప్రైవేటు యూనివర్శిటీల్లో కూడా నాణ్యత ఉండేలా చర్యలు. ఈ మార్పుల వల్ల పిల్లలకు మంచి జరుగుతుంది.
☛ ఇంతకుముందు ఉన్న ప్రైవేటు యూనివర్శిటీలు, కొత్తగా ఏర్పాటు చేసే ప్రైవేటు యూనివర్శిటీలకు ప్రపంచంలోని టాప్‌ 100 యూనివర్శిటీలతో టై అప్‌ ఉండేలా చట్ట సవరణ. దీనివల్ల జాయింట్‌ సర్టిఫికేషన్‌కు వీలు కలుగుతుంది. ఇప్పుడు నడుస్తున్న ప్రైవేటు కాలేజీలు యూనివర్శిటీలుగా మారితే వచ్చే అదనపు సీట్లలో 35శాతం సీట్లు కన్వీనర్‌ కోటాలోకి వస్తాయి. దీని పిల్లలకు మేలు జరుగుతుంది.
☛ కురుపం ఇంజనీరింగ్ కాలేజీల్లో 50 శాతం సీట్లు గిరిజనులకు కేటాయించే ప్రతిపాదనకు ఆమోదం
☛ పోలవరం ముంపు బాధితులకు 8424 ఇళ్ల నిర్మాణానికి ఆమోదం.  
☛ అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణకు, పీఓటీ చట్ట సవరణకు ఆమోదం 
☛ భూదాన్, గ్రామదాన్ చట్ట సవరణ బిల్లుకి ఆమోదం
☛ దేవాదాయ చట్ట సవరణ బిల్లుకి ఆమోదం.

☛ New Medical Colleges: 17 మెడికల్‌ కాలేజీలు... 4,735 ఎంబీబీఎస్‌ సీట్లు - సీఎం జగన్‌

Published date : 21 Sep 2023 09:19AM

Photo Stories