Skip to main content

School and Colleges Holidays 2023 : స్కూళ్లు, కాలేజీలు మూసివేత.. కార‌ణం ఇదే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి ఇచ్చిన బందు పిలుపు సందర్భంగా స్కూళ్లు, కాలేజీలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించారు. దీంతో విద్యాసంస్థలు మూతపడ్డాయి.
Schools Holidays, strike at Kakatiya University
ts educational institutions holidays

కేయూ పీహెచ్డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయని.. వాటిని పరిష్కరించాలని విద్యార్థులు చేసిన డిమాండ్లను పట్టించుకోకపోవడం లేదని కేయూ జేఏసీ విద్యార్థులు బంద్‌కు పిలుపునిచ్చారు. విద్యార్థి జేఏసీ బందుకు కాంగ్రెస్, బీజేపీ మద్దతు తెలిపింది.

☛ Telangana Schools & Colleges Dussehra Holidays 2023 : తెలంగాణలో భారీగా దసరా, బతుకమ్మ సెలవులు.. మొత్తం ఎన్ని రోజులు అంటే..?

బంద్‌కు మద్దతుగా..

ts schools and colleges closed news telugu

ప్రస్తుతం వరంగల్ లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. విద్యాసంస్థలు మూతపడ్డాయి. వాణిజ్య, వ్యాపార సముదాయాల్లో రద్దీ కనిపించడం లేదు. బంద్ కు సహకరించాలని కేయూ జేఏసీ విద్యార్థులు కోరుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు బంద్‌కు మద్దతు తెలిపాయి. వరంగల్ బంద్ సందర్భంగా కాకతీయ యూనివర్శిటీ వద్ద పోలీస్ బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. ప్రవేటు కళాశాల బస్సులను కేయూ జేఏసీ స్టూడెంట్స్ అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, కేయూ జేఏసీ విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరగడంతో ఉద్రిక్తత నెలకొంది.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

Published date : 13 Sep 2023 09:58AM

Photo Stories