నాలుగు పాఠశాలలు మూత
Sakshi Education
దుబ్బాక: విద్యార్థులు లేరని మున్సిపాలిటీతో పాటు మండలంలో నాలుగు సర్కారు బడులకు తాళాలు పడ్డాయి.
రేకులకుంట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 12 మంది విద్యార్థులున్నా.. టీచర్‌లేక, నిర్వహణ లేక వారందరూ ప్రైవేట్ బాటపట్టడంతో రెండేళ్లుగా మూతబడి ఉంది. అలాగే మున్సిపల్ పరిధిలోని మల్లాయపల్లి, లచ్చపేట ఉర్దూ పాఠశాలతో పాటు బల్వంతాపూర్ ఒడ్డెర కాలనీ పాఠశాల సైతం మూతపడ్డాయి. దీంతో ఈ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు డిప్యుటేషన్‌పై ఇతర పాఠశాలల్లో పనిచేస్తున్నారు.
బడులు మూతపడ్డా సంబంధిత అధికారులు తెరిపించడానికి పెద్దగా చర్యలు తీసకున్న దాఖలాలు లేవని స్థానికులు ఆరోపిస్తున్నారు.
చదవండి:
CMOverseas Scheme: మైనారిటీల విదేశీ విద్యకు సర్కార్ చేయూత
Vocational Inter students : ఒకేషనల్ ఇంటర్ విద్యార్థులు అప్రెంటీస్ చేయాలి
Published date : 11 Jul 2024 09:59AM