PG Examinations 2023: పీజీ సెమిస్టర్ పరీక్షలు మెదలు... ఎప్పుడూ?
సాక్షి ఎడ్యుకేషన్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో పీజీ రెండవ, నాల్గవ సెమిస్టర్ పరీక్షలు సోమవారం నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వర్సిటీ వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ ఎ.ఆనందరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు జిల్లాలో రాయలసీమ యూనివర్సిటీ, సిల్వర్‌జూబ్లీ కళాశాల, జ్యోతిర్మయి డిగ్రీ కాలేజీ (ఆదోని), నంద్యాల జిల్లాలో నంద్యాల, ఆళ్లగడ్డ, నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
Govt. Schools and Colleges: గ్రామ విద్యార్థులని తిరిగి బడికి చేరువ చేసే కార్యక్రమంలో ప్రభుత్వం
పీజీ రెండవ సెమిస్టర్ రెగ్యులర్ 476 మంది, సప్లిమెంటరీ 137, పీజీ నాల్గవ సెమిస్టర్ రెగ్యులర్ 523, సప్లిమెంటరీ 210 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు గంట ముందు చేరుకోవాలని సూచించారు.