Primary School : ఈ ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతులు.. విద్యార్థులు మాత్రం..
మద్దికెర: బొమ్మనపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతుల్లో కేవలం ఆరుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. 2వ తరగతిలో ఇద్దరు, 4లో ఒకరు, 5లో ముగ్గురు మాత్రమే విద్యనభ్యసిస్తున్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛☛ Follow our Instagram Page (Click Here)
వారికి విద్య బోధించేందుకు ఒక ఉపాధ్యాయున్ని నియమించారు. ఈ గ్రామంలో ఎక్కువ కుటుంబాలు ఉపాధి కోసం హైదరాబాద్, గుంటూరు, బెంగళూరు తదితర పట్టణాలకు వలస వెళ్లిపోయాయి.
దీంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పడిపోయింది. గతంలో ఇలాగే విద్యార్థి సంఖ్య పడిపోవడంతో స్కూలు మూత పడింది. అయితే కరోనా సమయంలో వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన కుటుంబాలు స్వగ్రామానికి చేరుకోవడంతో విద్యార్థుల సంఖ్య మళ్లీ 25 చేరింది.
☛ Join our WhatsApp Channel (Click Here)
అయితే ఇటీవల కొందరు మళ్లీ ఉపాధి కోసం వలస వెళ్లడంతో విద్యార్థుల సంఖ్య ఆరుగురికి పడిపోయిందని ఉపాధ్యా యుడు నాగశేషు శనివారం తెలిపారు.