JNTU Results: బీటెక్ ఫలితాలు విడుదల
Sakshi Education
అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన బీటెక్ మూడో సంవత్సరం రెండో సెమిస్టర్ (ఆర్ 20) పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్‌వీ సత్యనారాయణ తెలిపారు.
ఆగస్టు 14న జరిగిన పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. ఫలితాల కోసం విద్యార్థులు కళాశాల అకడమిక్ సెక్షన్‌లో సంప్రదించాలని ప్రినిపాల్ సత్యనారాయణ తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య ఇ. అరుణ కాంతి, హెచ్‌ఓడీలు డాక్టర్ విష్ణువర్ధన్, డాక్టర్ కేఎఫ్ భారతి, డాక్టర్ కళ్యాణి రాధ, డాక్టర్ దిలీప్ కుమార్, డాక్టర్ యం. రామశేఖర రెడ్డి, ఆచార్య భువనవిజయ, డాక్టర్ లలిత కుమారి, అజిత పాల్గొన్నారు.
Analog Astronaut Dangeti Jahnavi on CM Jagan's Support: Insights from Palakollu #sakshieducation
Published date : 02 Sep 2023 05:22PM