Skip to main content

Inspiring Students: 120 గ్రామాల దత్తత... ఎస్కేయూ విద్యార్థుల సేవాకార్యక్రమాలు!

‘దేశానికి పల్లె సీమలే పట్టుగొమ్మలు’ అనే నానుడిని నిజం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. ఈ నేపథ్యంలో ‘ఉన్నత భారత్‌ అభియాన్‌’ పేరుతో గ్రామాల్లో సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతం చేసేలా వర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలను భాగస్వాములను చేస్తోంది.
SKU Students
  • ఎస్కేయూ విద్యార్థుల సేవాకార్యక్రమాలు
  • ఒక్కో ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ తరఫున ఒక్కో గ్రామం దత్తత
  • మొత్తం ఆరు ప్రాధాన్యత రంగాల్లో ప్రభుత్వానికి తోడ్పాటు
  • శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌ కళాశాలకు చెందిన జాతీయ సేవా పథకం

120 గ్రామాల దత్తత..

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) పరిధిలో మొత్తం 120 జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) యూనిట్లు ఉన్నాయి. ఇందులో క్యాంపస్‌ కళాశాలల్లోనే నాలుగు యూనిట్లు పనిచేస్తున్నాయి. ఈ 120 యూనిట్లు ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకున్నాయి. గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించుకున్న ఆరు ప్రాధాన్యత రంగాలను ఎంచుకుని ఆయా రంగాల అభివృద్ధికి ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు శ్రమిస్తున్నారు. పరిశోధన ఫలాలు, ప్రభుత్వ పథకాలను సమన్వయ పరుస్తూ సాంకేతిక పరిజ్ఞాన బదిలీ ద్వారా గ్రామీణాభివృద్ధికి బాటలు వేస్తున్నారు. ఆయా గ్రామాల్లో సురక్షిత తాగునీరు, పరిసరాల పరిశుభ్రత, ప్రజారోగ్యం, వ్యవసాయం, గ్రామీణ చేతివృత్తులు, సీ్త్రశిశు సంక్షేమం, మౌలిక వసతుల కల్పన వంటి ఆరు ప్రాధాన్యత రంగాల అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు.

Santoshkumar Shastri: పిల్లలకు ఆచారాలు నేర్పించండి

ఆత్మవిశ్వాసం పెంపొందేలా..

గ్రామాలను పర్యటించడం, సమస్యలను అధ్యయనం చేయడం వంటి కార్యక్రమాలతో విద్యార్థుల్లో అంతులేని ఆత్మవిశ్వాసం, సాంకేతిక నైపుణ్యాలు, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు పెంపొందుతున్నాయి. ఈ క్రమంలోనే గ్రామీణుల అభ్యున్నతికి ఉపయోగపడే నూతన పరిశోధనలకూ మార్గం సుగమమవుతోంది. దత్తత తీసుకున్న పల్లెల్లో స్థానిక ప్రాధాన్యాతల గుర్తింపు, సాంకేతికత బదిలీ వంటి కీలక అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది.

(ఎన్‌ఎస్‌ఎస్‌) యూనిట్‌కు చెందిన విద్యార్థులు వర్సిటీకి సమీపంలోని చిన్నకుంట గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆ గ్రామంలో పర్యటించి ఇంటింటి సర్వేతో పాటు ఆరు ప్రాధాన్యమైన అంశాలలో అధ్యయనం చేశారు. అనంతరం ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసి, గ్రామంలో అక్షరాస్యత పెంపు, పేదరికం నిర్మూలన, అభివృద్ధి కార్యక్రమాలను విస్తారంగా

Jobs: లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

చేపట్టారు. ఇందుకు గాను ప్రభుత్వం నుంచి ఒక్కో యూనిట్‌కు రూ.36 వేలు చొప్పున నిధులు విడుదలయ్యాయి. ఇలా కేవలం ఎస్కేయూ క్యాంపస్‌ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ ఒక్కటే కాదు... వర్సిటీ పరిధిలోని ప్రతి డిగ్రీ కళాశాలలో ఉన్న ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్లు ముందుకు వచ్చి ఒక్కో గ్రామాన్ని దత్తతకు తీసుకుని సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నాయి.

నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి

జాతీయ సేవా పథకంలో పాల్గొనడం ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి. ప్రతి యూనిట్‌ తరపున ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకునేలా చర్యలు తీసుకున్నాం. విద్యార్థి దశ నుంచే సామాజిక స్పృహ కలిగి ఉండాలనే ఉద్ధేశ్యంతో ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఒక్కో యూనిట్‌కు రూ.36 వేలు చొప్పున నిధులు అందాయి. – డాక్టర్‌ మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి, వీసీ, ఎస్కేయూ

Published date : 06 Nov 2023 01:29PM

Photo Stories