RUSA: ఎస్కేయూ ప్రగతికి భరూసా
నాణ్యమైన పరిశోధన, బోధనాభ్యసన పెంపుదల, ఉత్తమ ఆవిష్కరణలు దోహదం చేయడానికి వీలుగా రూసా పథకం కింద న్యాక్ గ్రేడింగ్‌ను బట్టి కేంద్ర ప్రభుత్వం 60 శాతం , రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వాటాతో నిధులు జమ చేస్తాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఎస్కేయూకు రూ.20 కోట్ల మేర నిధులు మంజూరు కాగా, నాలుగు రకాల మౌలిక వసతుల మెరుగుకు వినియోగించారు.
ఇప్పటి వరకూ రూ.14 కోట్లు వ్యయం కాగా, మరో రూ.6 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ మొత్తానికి సంబంధించి వినియోగితా పత్రాలు (యూటిలైజేషన్ సర్టిఫికెట్స్) అందజేస్తే మరో దఫా నిధులు మంజూరు కానున్నాయి. న్యాక్‌లో ఏ గ్రేడ్ దక్కితే రూ.40 కోట్లు, బీ గ్రేడ్ దక్కితే రూ.20 కోట్లు రానున్నాయి. ఈ మొత్తాన్ని రాబోవు ఐదేళ్లలో వర్సిటీలో అభివృద్ధి పనులకు వెచ్చించాల్సి ఉంటుంది.
చదవండి: Inspiring Students: 120 గ్రామాల దత్తత... ఎస్కేయూ విద్యార్థుల సేవాకార్యక్రమాలు!
అందుబాటులోకి నూతన భవనాలు
ఇప్పటికే అందిన రూసా నిధులతో క్యాంపస్‌లో నూతనంగా సరస్వతి ఉమెన్స్ హాస్టల్, మెన్స్ హాస్టల్‌ను నిర్మించారు. 50 గదులు కలిగిన ఉమెన్స్ హాస్టల్‌కు రూ. 3.25 కోట్లు, మెన్స్ హాస్టల్‌కు రూ.3.25 కోట్లు ఖర్చు చేశారు. అకడమిక్ భవనంలో టాయిలెట్ బ్లాక్స్ ఏర్పాటుకు రూ.50 లక్షలు ఖర్చు చేశారు. మొత్తం నూతన నిర్మాణాలకు రూ.7 కోట్లు వెచ్చించారు.
నీటి నిల్వకు కొత్త సంపుల ఏర్పాటుకు రూ.53.50 లక్షలు, పైప్‌లైన్ నిర్మాణానికి రూ. 48 లక్షలు కేటాయించారు. డ్రైనేజీ, స్వీజ్ లైన్స్ పనులకు రూ.1.21 కోట్లు, ఆల్టర్నేటివ్ ఎనర్జీ రీసోర్సెస్‌కు రూ.1.45 కోట్లు, క్యాంపస్ సుందరీకరణకు రూ.40 లక్షలు, లైబ్రరీ భవన మరమ్మతులకు రూ.50 లక్షలు, 7 హాస్టళ్లలో మరుగుదొడ్ల మరమ్మతులకు రూ.1.59 కోట్లు, ల్యాబొరేటరీల మరమ్మతులకు రూ.43 లక్షలు ఖర్చు చేశారు.
సమగ్రాభివృద్ధికి చర్యలు
ఎస్కేయూ సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. న్యాక్‌కు సంబంధించి ఇప్పటికే ఎస్‌ఎస్‌ఆర్ (సెల్ఫ్ స్టడీ రిపోర్ట్)ను నివేదించాం. ఈ నివేదిక ఆధారంగా క్యాంపస్‌ను న్యాక్ పీర్ కమిటీ సందర్శించి గ్రేడింగ్ ఇస్తుంది. ఇందులో మెరుగైన గ్రేడింగ్ రావాలని ఆశిస్తున్నాం.
– డాక్టర్ చింతా సుధాకర్, ఇన్‌చార్జ్ వీసీ, ఎస్కేయూ