Skip to main content

IIT Madras: మొదటి అంతర్జాతీయ క్యాంపస్ జాంజిబార్‌లో ప్రారంభం... ఆఫర్ చేస్తున్న కోర్సులు ఇవే! 

జాంజిబార్ అధ్యక్షుడు మరియు విప్లవ మండలి ఛైర్మన్, హుస్సేన్ అలీ మ్వినీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్ జాంజిబార్ ప్రారంభోత్సవానికి అధ్యక్షత వహించారు. టాంజానియా అధికారులు, భారతీయ ఉన్నతాధికారులు, అధ్యాపకులు, విద్యార్థుల సమక్షంలో జాంజిబార్ క్యాంపస్‌లో ఈ చారిత్రాత్మక వేడుక జరిగింది.
Faculty and Students Gather at Zanzibar Campus for IIT Madras Inaugural Ceremony, IITM. President Hussain Ali Mwini at IIT Madras Zanzibar Inauguration, Tanzanian and Indian Officials at IIT Madras Zanzibar Inauguration,

IIT మద్రాస్ జాంజిబార్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మొట్టమొదటి అంతర్జాతీయ క్యాంపస్‌. ప్రారంభంలో, ఇన్స్టిట్యూట్ BS, MTech ప్రోగ్రామ్‌లను అందిస్తుంది... భవిష్యత్తులో డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో అదనపు అకడమిక్ ప్రోగ్రామ్‌లను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. మొదటి బ్యాచ్ విద్యా సంవత్సరం అక్టోబర్ 2023లో ప్రారంభమైంది.

Exam Stress: ఈ టాప్ 11 చిట్కాలు ఫాలో అయితే... ఏ పరీక్ష ఒత్తిడి ఉండదు!

డేటా సైన్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని కోణాలను కవర్ చేసే సమగ్ర పాఠ్యప్రణాళికతో పాటు, విద్యార్థులు తమ అధ్యయన సమయంలో వివిధ ఉత్తేజకరమైన అవకాశాలను పొందగలుగుతారు. ఈ అవకాశాలలో విదేశాలలో చదువుకోవడం మరియు UK, ఆస్ట్రేలియా మరియు ఇతర దేశాలలోని IIT మద్రాస్ యొక్క భాగస్వామ్య సంస్థలతో సెమిస్టర్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లు, సంబంధిత కంపెనీలతో ఇంటర్న్‌షిప్‌లు మరియు భారతదేశంలోని చెన్నైలోని IIT మద్రాస్ క్యాంపస్‌లో కొన్ని కోర్సులు ఉన్నాయి.

IIT మద్రాస్ జాంజిబార్ లో, జాంజిబార్, టాంజానియా, నేపాల్, భారతదేశం నుండి వచ్చిన విద్యార్థులు ప్రవేశం పొందారు... వారిలో 40% మహిళలు ఉన్నారు. IITM జాంజిబార్ అకడమిక్ ప్రోగ్రామ్స్ కు భారతీయలతో సహా అన్ని దేశాల విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి.

UCEED 2024: ఐఐటీల్లో డిజైన్‌ కోర్సులు.. పరీక్షలో రాణించేలా

Published date : 07 Nov 2023 02:43PM

Photo Stories