Skip to main content

UCEED 2024: ఐఐటీల్లో డిజైన్‌ కోర్సులు.. పరీక్షలో రాణించేలా

అండర్‌ గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ ఫర్‌ డిజైన్‌.. సంక్షిప్తంగా యూసీడ్‌! దేశంలో సాంకేతిక విద్యకు పేరు గడించిన ఐఐటీ క్యాంపస్‌ల్లో.. బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సుల్లో.. ప్రవేశానికి నిర్వహించే పరీక్ష యూసీడ్‌! ఇది డిజైన్‌ రంగంలో అడుగు పెట్టాలనుకునే వారికి చక్కటి మార్గం!! ఇందులో స్కోర్‌ ఆధారంగా నాలుగు ఐఐటీలు, ట్రిపుల్‌ఐటీడీఎం-జబల్‌పూర్‌లో బీ-డిజైన్‌ కోర్సుల్లో అడ్మిషన్‌ లభిస్తుంది. తాజాగా యూసీడ్‌-2024 నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ నేపథ్యంలో.. యూసీడ్‌తో ప్రయోజనాలు, అర్హతలు, పరీక్ష విధానం, ఎంట్రెన్స్‌లో రాణించేందుకు గైడెన్స్‌..
Design courses in IIT
Design courses in IIT
  • యూసీడ్‌-2024 నోటిఫికేషన్‌ విడుదల
  • ఈ స్కోర్‌తో బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశం
  • నాలుగు ఐఐటీలు, ట్రిపుల్‌ ఐటీ డీఎంలో కోర్సులు
  • 2024, జనవరి 21న యూసీడ్‌-2024 పరీక్ష

డిజైన్‌.. ఇప్పుడు ఏ రంగంలో చూసినా వినిస్తున్న మాట. ముఖ్యంగా పారిశ్రామిక విభాగంలో ప్రొడక్ట్‌ డిజైన్, అదేవిధంగా ఇంటీరియర్‌ డిజైన్, ఆర్కిటెక్చర్‌ డిజైన్, వెబ్‌ డిజైనింగ్, గ్రాఫిక్‌ డిజైన్‌-యానిమేషన్, ఫిల్మ్‌మ్స్‌ తదితర విభాగాల్లో డిజైనింగ్‌ ప్రాధా­న్యం పెరుగుతోంది. ఆయా డిజైన్‌ కార్యకలాపాలను సమర్థవంతంగా పూర్తి చేయాలంటే.. సంబంధిత నైపుణ్యాలు ఉండాల్సిందే. ఆ స్కిల్స్‌ను అందించే కో­ర్సు బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌. ఈ కోర్సును ఇంజనీరింగ్‌ విద్యలో పేరుగాంచిన ఐఐటీలు అందిస్తున్నాయి. ఐఐటీల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సులో ప్రవేశానికి మార్గం యూసీడ్‌. ప్రతి ఏడాది ఐఐటీ-ముంబై ఈ పరీక్ష నిర్వహణ చేపడుతోంది. 2024 ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

అర్హత

  • ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణత ఉండాలి. 2023లో ఉత్తీర్ణత సాధించిన వారు, 2024లో ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న వారు మాత్రమే అర్హులు.
  • ఐఐఐటీడీఎం-జబల్‌పూర్, ఐఐటీ-గువహటిలలో సీటు కోరుకునే అభ్యర్థులు ఇంటర్మీడియెట్‌లో తప్పనిసరిగా ఎంపీసీ గ్రూప్‌ చదివుండాలి.

చ‌ద‌వండిFashion Career: ప్యాషన్‌ పట్ల మక్కువ... ఆక‌ర్షణీయ వేత‌నాలు ఎక్కువ‌

వయసు
జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ-ఎన్‌సీఎల్‌ అభ్యర్థులు అక్టోబర్‌ 1, 1999 తర్వాత జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అక్టోబర్‌ 1, 1994 తర్వాత జన్మించి ఉండాలి.

5 క్యాంపస్‌లు..199 సీట్లు

  • యూసీడ్‌ ఎంట్రన్స్‌లో ర్యాంకు ఆధారంగా అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య 199. క్యాంపస్‌ల వారీగా సీట్ల వివరాలు.. ఐఐటీ-ముంబై 37, ఐఐటీ-ఢిల్లీ 20, ఐఐటీ-గువహటి 56, ఐఐటీ-హైదరాబాద్‌ 20, ఐఐటీడీఎం-జబల్‌పూర్‌ 66. 
  • నాలుగు ఐఐటీలతోపాటు జబల్‌పూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, డిజైన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్యాంపస్‌లోని బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సు ప్రవేశానికి కూడా యూసీడ్‌ స్కోర్‌నే పరిగణనలోకి తీసుకుంటారు.
  • వీటితోపాటు గురుగోవింద్‌ సింగ్‌ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ, యూపీఈఎస్‌ -డెహ్రాడూన్, డి.వై.పాటిల్‌ యూనివర్సిటీ తదితర 20కి పైగా ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇన్‌స్టిట్యూట్‌లు, యూనివర్సిటీలు.. యూసీడ్‌ స్కోర్‌ ఆధారంగా బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి.

300 మార్కులకు పరీక్ష
యూసీడ్‌ పరీక్షను రెండు విభాగాల్లో 300 మార్కులక నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు.

పార్ట్‌-ఎ.. 240 మార్కులు

  • యూసీడ్‌లో భాగంగా పార్ట్‌-ఎ పరీక్ష మూడు విభాగాల్లో ఉంటుంది. అవి..సెక్షన్‌ 1లో ఎన్‌ఏటీ 14 ప్రశ్నలు-56 మార్కులు, సెక్షన్‌ 2లో ఎంఎస్‌క్యూ 15 ప్రశ్నలు-60 మార్కులు, సెక్షన్‌ 3లో ఎంసీక్యూ 28 ప్రశ్నలు-84 మార్కులు.. ఇలా మొత్తం 57 ప్రశ్నలు-200 మార్కులకు పరీక్ష జరుగుతుంది. 
  • సెక్షన్‌-1, 2లలో ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు, సెక్షన్‌-3లో ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు కేటాయించారు.
  • సెక్షన్‌-2లో ఎంఎస్‌క్యూ ప్రశ్నల విధానంలో ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు ఉండే ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు ఎంచుకున్న ఆప్షన్లను బట్టి గరిష్టంగా నాలుగు మార్కులు, కనిష్టంగా ఒక మార్కు కేటాయిస్తారు. పరీక్ష పూర్తిగా కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌గా నిర్వహిస్తారు.

చ‌ద‌వండిUCEED 2023 Notification: కెరీర్‌ డిజైన్‌.. యూసీడ్‌కు దరఖాస్తుకు అర్హతలు, పరీక్ష విధానం, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

పార్ట్‌-బి.. స్కెచింగ్‌

  • పార్ట్‌-బిని అభ్యర్థుల్లోని డిజైన్‌ నైపుణ్యాలను పరిశీలించే విధంగా ఆఫ్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తా­రు. పార్ట్‌-బిలో స్కెచింగ్‌ ఉంటుంది. దీనికి కేటాయించిన మార్కులు 60. ఈ విభాగంలో అభ్యర్థులకు ఏదైనా ఒక అంశాన్ని ఇచ్చి దానికి సంబంధించిన డ్రాయింగ్‌ వేయమని అడుగుతారు. ఈ పరీక్షను పెన్, పేపర్‌ విధానంలో నిర్వహిస్తారు.
  • స్కెచింగ్‌కు సంబంధించి ఒక ప్రశ్న (50 మార్కులు), డిజైన్‌ ఆప్టిట్యూడ్‌కు సంబంధించి ఒక ప్రశ్న (50 మార్కులు) చొప్పున మొత్తం రెండు ప్రశ్నలతో పార్ట్‌-బిను నిర్వహిస్తారు.
  • పార్ట్‌-ఎ, బి రెండు సెక్షన్లు కలిపి 300 మార్కులకు పరీక్ష ఉంటుంది.

పరీక్షలో రాణించేలా

  • ప్రతిష్టాత్మక ఐఐటీ క్యాంపస్‌లలో డిజైన్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి మార్గం వేసే యూసీడ్‌ పరీక్షలో విజయం సాధించాలంటే.. అభ్యర్థులు క్రియేటివ్‌ అప్రోచ్‌ను అలవర్చుకోవాలి. దాని ఆధారంగా తమ ప్రిపరేషన్‌ను సాగించాలి. 
  • పార్ట్‌-ఎలో విజువలైజేషన్‌ అండ్‌ స్పేషియల్‌ ఎబిలిటీ, అబ్జర్వేషన్‌ అండ్‌ డిజైన్‌ సెన్సిటివిటీ, ఎన్విరాన్‌మెంటల్‌ అండ్‌ సోషల్‌ అవేర్‌నెస్, అనలిటికల్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్, లాంగ్వేజ్‌ అండ్‌ క్రియేటివిటీ, డిజైన్‌ థింకింగ్‌ అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ అంశాలపై దృష్టి పెట్టాలి. nపార్ట్‌-బికు సంబంధించి.. ప్రొడక్ట్‌ డ్రాయింగ్, సిట్యుయేషన్‌ బేస్డ్‌ డ్రాయింగ్‌ అంశాలపై పట్టు సాధించాలి.
  • పార్ట్‌-ఎలో ప్రశ్నలను న్యూమరికల్‌ ఆన్సర్‌ టైప్, మల్టిపుల్‌ సెలక్ట్‌ టైప్, మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో అడుగుతారు. కాబట్టి అభ్యర్థులు సిలబస్‌కు అనుగుణంగా ఆయా అంశాలపై అన్ని కోణాల్లోనూ అవగాహన ఏర్పరచుకునేలా ప్రిపరేషన్‌ సాగించాలి. వెర్బల్, నాన్‌-వెర్బల్‌ రీజనింగ్‌ అంశాలు, ఇంగ్లిష్‌ గ్రామర్, రీడింగ్‌ కాంప్రహెన్షన్, వొకాబ్యులరీపై అవగాహన పెంచుకోవాలి. 
  • దీంతోపాటు.. జనరల్‌ అవేర్‌నెస్‌కు సంబంధించి సామాజిక అభివృద్ధిలో డిజైన్‌ ప్రాముఖ్యత, పర్యావరణం, కాలుష్యం తదితర అంశాలపై పట్టు సాధించాలి.

జోసా ద్వారా సీట్ల భర్తీ

  • ఐఐటీ-ముంబై ఆధ్వర్యంలో జరిగే యూసీడ్‌ స్కోర్‌ ఆధారంగా జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ ప్రక్రియ నిర్వహిస్తారు.
  • యూసీడ్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ ప్రక్రియలో పాల్గొని కామన్‌ అప్లికేషన్‌ ఫామ్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది.
  • కామన్‌ అప్లికేషన్‌ సమయంలో అభ్యర్థులు పేర్కొన్న ఇన్‌స్టిట్యూట్‌ ప్రాథమ్యాలు, అందుబాటులో ఉన్న సీట్లు, అభ్యర్థులు పొందిన స్కోర్‌లను బేరీజు వేస్తూ సీట్‌ అలాట్‌మెంట్‌ చేస్తారు.
  • ఈ మొత్తం ప్రక్రియను ఐఐటీ-ముంబైలోని డిజైన్‌ డిపార్ట్‌మెంట్‌ నిర్వహిస్తుంది.

ఉజ్వల కెరీర్‌
బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సు పూర్తి చేసుకున్న వారికి ప్రొడక్ట్‌ డిజైన్‌; ఆటోమొబైల్‌ డిజైన్, టాయ్‌ డిజైన్, ఇంటీరియర్‌ డిజైన్, ఆర్కిటెక్చర్‌ డిజైన్, వెబ్‌ డిజైనింగ్, గ్రాఫిక్‌ డిజైన్‌-యానిమేషన్‌ ఫిల్మ్‌ డిజైన్‌ వంటి రంగాల్లో అవకాశాలు లభిస్తున్నాయి. 
అదే విధంగా తయారీ రంగ పరిశ్రమలు, ఎంఎన్‌సీలు, పరిశోధన సంస్థలు ప్రధానమైన ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. ప్రారంభంలో డిజైన్‌ ఎగ్జిక్యూటివ్‌ హోదాలో అడుగుపెట్టి.. రెండు, మూడేళ్ల అనుభవంతో డిజైన్‌ సూపర్‌వైజర్, డిపార్ట్‌మెంట్‌ హెడ్, చీఫ్‌ డిజైనర్‌ వంటి ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు. 

ప్రాంగణ నియామకాలు
ఎంటర్‌టైన్‌మెంట్, ప్రొడక్షన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్‌ రంగాలకు చెందిన పలు సంస్థలు క్యాంపస్‌ డ్రైవ్స్‌ సైతం నిర్వహించి ఆఫర్లు ఖరారు చేస్తున్నాయి. సగటు వార్షిక వేతనం రూ.8 లక్షలుగా నిలుస్తోంది.

ఉన్నత విద్య
యూసీడ్‌ స్కోర్‌ ద్వారా బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి ఉన్నత విద్య అవకాశాలు సైతం అందుబాటులో ఉన్నాయి. ఐఐటీలు, నిఫ్ట్, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ తదితర ఇన్‌స్టిట్యూట్‌లలో మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌లో తమకు ఆసక్తి ఉన్న స్పెషలైజేషన్‌ అభ్యసించొచ్చు. 

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 2023, అక్టోబర్‌ 31
  • యూసీడ్‌ పరీక్ష తేదీ: 2024, జనవరి 21
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం
  • ఫలితాల వెల్లడి: 2024, మార్చి 8
  • వెబ్‌సైట్‌: https://www.uceed.iitb.ac.in/2024/
Published date : 30 Oct 2023 07:36PM

Photo Stories