Kakatiya University: పీహెచ్‌డీ సీట్లు పెంచాలని ఆందోళన
కేయూ క్యాంపస్: కేయూలో పీహెచ్‌డీ సీట్లు తక్కువగా ఉన్నాయని, వెంటనే పెంచాలని, ప్రస్తుతం నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలను వాయిదా వేయాలని గురువారం వివిధ విద్యార్థి సంఘాల బాధ్యులు ఆందోళన చేశారు. ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న హ్యూమనిటీస్ భవనంలోనికి వెళ్లే యత్నం చేయగా అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. ఇరువురికి వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్టేషన్‌కు తరలించారని సమాచారం. అనంతరం మళ్లీ విద్యార్థి సంఘాల బాధ్యులు క్యాంపస్‌కు చేరుకొని ఓ దిష్టిబొమ్మను తీసుకొని పరిపాలనాభవనం వైపు వెళ్లారు. అప్పటికే అక్కడ పోలీసులు ఉండటంతో ఆ దిష్టిబొమ్మను చెట్లలో పడేశారు. వీసీ రమేష్‌కు వినతిపత్రం సమర్పించారు. దీనిపై సంబంధిత డీన్‌లకు లేఖ రాస్తామని వీసీ రమేష్ వారికి తెలియజేశారు. విద్యార్థి సంఘాల బాధ్యులు నరేష్, మచ్చ పవన్ కళ్యాణ్, పాషా, మనోహర్, తిరుపతి, రాకేష్ పాల్గొన్నారు.
చదవండి: National Medical Commission: 10 లక్షల జనాభాకు ఇన్ని ఎంబీబీఎస్ సీట్లు