శ్రీనిధి యూనివర్సిటీ: విద్యార్థులపై, ఏబీవీపీ సిబ్బందులపై దాడికి కారణం..?
సాక్షి ఎడ్యుకేషన్: యమ్నంపేట్‌లోని శ్రీనిధి ఇంజినీరింగ్ కాలేజీలో కొందరు విద్యార్థులను హాజరు శాతం తక్కువగా ఉందన్న కారణంతో డిటెయిన్ చేశారు. వీరి పక్షాన యాజమాన్యంతో మాట్లాడేందుకు ఏబీవీపీ నాయకులు గురువారం కాలేజీకి వచ్చారు. సెక్యూరిటీ సిబ్బంది వారిని లోపలికి అనుమతించకపోవడంతో ఎందుకు ఆపుతున్నారని విద్యార్థులు ప్రశ్నించారు.
మీకేంది చెప్పేదంటూ సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారు. ఈ దాడుల్లో ఎం.మనోహర్‌తో పాటు ఏబీవీపీ నాయకులు సచిన్ నాయక్, కె.ఆదిత్యకు గాయాలయ్యాయి. మనోహర్ పన్ను విరిగింది. దీంతో పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్‌లో మనోహర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఐదుగురు సెక్యూరిటీ సిబ్బంది సందీప్, రాందాస్, ప్రశాంజిత్‌దాస్, నవీన్ రోకయా, అర్జున్ సింగ్, షేక్ అబ్దుల్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.