Free Training in Sign Language: సైన్ లాంగ్వేజ్‌పై ‘కేఎఫ్‌సీ’ శిక్షణ
Sakshi Education
సాక్షి, సిటీబ్యూరో: ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ డే సందర్భంగా కేఎఫ్‌సీ ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభిస్తోందని కేఎఫ్‌సీ భారత్ జీఎం మోక్ష చోప్రా తెలిపారు.
క్షమతా కార్యక్రమంలో భాగంగా 240 నగరాలు, 1200పైబడి శాఖలు, 17 వేల మందికి పైగా సిబ్బందికి వంద శాతం మూగ, సైగ భాషపై శిక్షణ ఇస్తామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా విభిన్న ప్రాంతాలు, భాషలు ఉన్నాయి.
వాటన్నింటినీ కేఎఫ్‌సీ ఉద్యోగులు నేర్చుకోవడం సాధ్యంకాదు. అదే సైగల ద్వారా సహచర సిబ్బంది ఏం చెబుతున్నారు, వినియోగదారుని ఆర్డర్‌పై అవగాహన వస్తుందని పేర్కొన్నారు.
చదవండి: సెప్టెంబర్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here ▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
మెజారిటీ కేఎఫ్‌సీ శాఖల్లో మూగ, చెవుడుతో బాధపడుతున్న సిబ్బంది పనిచేస్తున్నారని, సైన్ లాంగ్వేజ్‌ని ఎవరైనా నేర్చుకోవచ్చని పేర్కొన్నారు. 2026 నాటికి కేఎఫ్‌సీ రెస్టారెంట్లలో సిబ్బందిని రెండింతలు చేయాలన్నదే లక్ష్యమన్నారు.
సెప్టెంబర్ 20న ఢిల్లీలో సైన్ లాంగ్వేజ్ యంత్రాన్ని ప్రారంభించారు. త్వరలోనే దేశంలోని అన్ని శాఖల్లో అందుబాటులోకి తెస్తామన్నారు.
Published date : 21 Sep 2024 03:59PM