Skip to main content

Apprentice fair: ఐటీఐ కళాశాలలో అప్రెంటీస్‌ మేళా

నగరంలోని ఐటీఐ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి ఈ మేళా ప్రారంభమవుతుందని పారిశ్రామిక శిక్షణ సంస్థ ప్రధానాధికారి తెలిపారు..
Central Government   Vocational Training   Apprentice Fair  Apprentice fair held at ITI college on 11th March   Ministry of Skill Development and Industrialization

 

ఏలూరు: కేంద్ర ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామికీకరణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ జనరల్‌ ట్రైనింగ్‌ ఆధ్వర్యంలో ఈనెల 11న అప్రెంటీస్‌ మేళా నిర్వహించనున్నట్టు ఏలూరు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ప్రధానాధికారి పి.రజిత ప్రకటనలో తెలిపారు. నగరంలోని ఐటీఐ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి ఈ మేళా ప్రారంభమవుతుందని, లిక్సిల్‌ ఇండియా, అశోక్‌ లేలాండ్‌, మోహన్‌ స్పిన్‌టెక్స్‌ ఇండియా, నాగ హనుమాన్‌ ఆగ్రో ఆయిల్స్‌, దీపక్‌ నెక్స్‌జన్‌ తదితర ప్రముఖ సంస్థల ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు.

Teacher Srinivas: విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా పాఠశాలలో ఈ పని చేసిన‌ ఓ ఉపాధ్యాయుడు

ఎస్‌ఎస్‌సీ పాస్‌, ఫెయిల్‌ అయిన వారు, ఐటీఐ డిప్లొమా లేదా ఏదైనా వృత్తి విద్య కోర్సు చేసిన వారు అర్హులని తెలిపారు. అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ మార్కుల మెమోలు, ఆధార్‌కార్డు, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలతో హాజరు కావాలని సూచించారు. వివరాలకు తమ కార్యాలయం పనివేళల్లో 08812–230269 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

Education News: విద్యార్థుల భవితను తీర్చిదిద్దే ఆలోచన.. జెడ్పీ హైస్కూల్లో వలంటీర్‌ వ్యవస్థ

Published date : 07 Mar 2024 05:42PM

Photo Stories