Inspirational Story: లిల్లీపుట్ అంటూ ఎగతాలి చేశారు... కట్ చేస్తే ఇప్పుడు అతనే ఇన్ఫిరేషన్
అలాంటిది మూడు అడుగులు ఉండే వారిని ఇంకెలా ఎగతాలి చేస్తారో చెప్పనవసరం లేదు. అలాంటి ఓ వ్యక్తి సక్సెస్ స్టోరీనే ఇది...
ఎంబీఏ పూర్తి చేసినా...
మూడు అడుగులే ఉన్నాడని ఎవరూ జాబు ఇవ్వలేదు. 28 ఏళ్ల అంకేశ్ కోస్తీ జన్యు సమస్యలతో ఎత్తు పెరగలేదు.. 3 అడుగులకే పరిమితమయ్యాడు. అయినా ఆ విషయాన్ని అతను ఏనాడూ పట్టించుకోలేదు. ఉన్నత చదవులు అభ్యసించి.. కుటుంబాన్ని ఆర్థిక కష్టాల నుంచి బయట పడేయాలనుకున్నాడు. అనుకున్నట్లేగానే ఉన్నత చదువులు అభ్యసించాడు. మంచి మార్కులతో ఎంబీఏ పట్టా పొందాడు. అనంతరం ఉద్యోగం కోసం వేట ప్రారంభించాడు. అతడిలో ఉన్న వైకల్యాన్ని చూసిన చాలా మంది ఉద్యోగం ఇచ్చేందుకు నిరాకరించారు.
అంకేశ్ కుటుంబ నేపథ్యం ఇదీ...
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ప్రాంతానికి చెందిని అంకేశ్ కోస్తీ (28) ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. అతడి తల్లి ఫ్యాక్టరీలో బీడీ కార్మికురాలుగా పని చేస్తుంటే.. తండ్రి సెలూన్ నడుపుతున్నాడు. అంకేశ్‌కు ఇద్దరు సోదరులు, ఓ సోదరి. చాలీచాలని డబ్బుతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తల్లిదండ్రులను చూస్తూ పెరిగిన అంకేశ్.. ఉన్నత చదువులు అభ్యసించి కష్టాలకు పుల్‌స్టాప్ పెట్టాలనుకున్నాడు. మంచి ఉద్యోగం పొంది తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాలని భావించాడు. పట్టుదలతో ఎంబీఏ పూర్తి చేశాడు. అనంతరం ఉద్యోగం కోసం వేట ప్రారంభించాడు. 3 అడుగులే ఉన్న కారణంగా అతడికి ఉద్యోగం ఇచ్చేందుకు కంపెనీలు నిరాకరించాయి.
ప్రయత్నాన్ని ఎప్పుడూ ఆపలేదు...
అంకేశ్ మాత్రం తన ప్రయత్నాన్ని ఆపలేదు. తన వైకల్యాన్ని కాకుండా ప్రతిభను చూసి ఏదో ఒక కంపెనీ తనకు జాబ్ ఆఫర్ చేస్తుందని గట్టిగా విశ్వసించాడు. రెండేళ్లపాటు నిర్విరామంగా ప్రయత్నించినా ఉద్యోగం లభించలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ సర్టిఫికెట్ పొందేందుకు ఎమ్మెల్యే సిఫార్సు లేఖ అవసరం అవడంతో స్థానిక ఎమ్మెల్యే ప్రవీణ్ పతక్‌ను కలిశాడు. అంకేశ్ సమస్యలన్నింటినీ తెలుసుకున్న ఎమ్మెల్యే భావోద్వేగానికి గురయ్యారు. అతడితో ఓ సెల్ఫీ తీసుకుని.. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంకేశ్ చదువు వివరాలను తెలిపి, అతడికి ఉన్న జాబ్ అవసరాన్ని తెలియజేశారు. అంతే.. ఈ ఒక్క ఘటనతో అంకేశ్‌కు ఆఫర్లు వెల్లువలా వచ్చాయి. సుమారు 40 కంపెనీలు అంకేశ్‌కు జాబ్ ఆఫర్ చేశాయి.