AP Medtech Zone: విశాఖలోనే మెడికల్ ఎక్విప్‌మెంట్ అక్రిడిటేషన్
Sakshi Education
సాక్షి, విశాఖపట్నం: మెడికల్ ఎక్విప్‌మెంట్ (వైద్య ఉపకరణాల) తయారీలో దిక్సూచిగా మారిన ఏపీ మెడ్‌టెక్ జోన్ సరికొత్త చరిత్ర సృష్టించింది.
యునైటెడ్ అక్రిడిటేషన్ ఫౌండేషన్ నుంచి అక్రిడిటేషన్ సాధించిన దేశంలోని మొదటిసంస్థగా ఏపీ మెడ్‌టెక్ జోన్ అవతరించింది. వైద్య పరికరాలు తయారు చేసే సంస్థలకు సర్టిఫికెట్ అందించే ప్రొవైడర్‌గా ఇందులోని కలాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ టెక్నాలజీ మారింది.
చదవండి: New Medical Colleges: కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు 112 దరఖాస్తులు.. అనుమతుల ప్రక్రియ ఇలా..
మెడికల్ ఎక్విప్‌మెంట్ తయారు చేసే సంస్థలకు ఇక్కడి నుంచే అక్రిడిటేషన్ మంజూరు చేస్తారు. 2028 జనవరి వరకూ మెడ్‌టెక్ జోన్ ఈ అవకాశం దక్కించుకుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు ఎకో సిస్టమ్ నిర్మించనున్నామని మెడ్‌టెక్ జోన్ ప్రతినిధులు తెలిపారు.
Published date : 10 Apr 2024 03:44PM