Skip to main content

Harish Rao: మరో 8 మెడికల్‌ కాలేజీలకు నిధులు!

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఏర్పాటు లక్ష్యం వచ్చే విద్యా సంవత్సరం నాటికి పూర్తికానుంది.
Harish Rao
మరో 8 మెడికల్‌ కాలేజీలకు నిధులు!

రెండు రోజుల కిందే తొమ్మిది కొత్త మెడికల్‌ కాలేజీలను సీఎం కేసీఆర్‌ ప్రారంభించగా.. వచ్చే ఏడాది మరో ఎనిమిదింటిని అందుబాటులోకి తేనున్నట్టు ప్రక టించారు. రూ.1,447 కోట్లతో ఈ 8 మెడికల్‌ కాలే జీలకు భవనాలు, హాస్టళ్లను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబ‌ర్ 16న‌ పరి పాలన అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వుల ప్రతిని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి టి.హరీశ్‌రావు ట్వీట్‌ చేశారు.

చదవండి: New Medical College: మెడి‘కల’ తీరింది!

తెలంగాణ ఏర్పాటుకు ముందు ఇక్కడ కేవలం ఐదు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలే ఉండగా.. వచ్చే ఏడాది నాటికి ఏకంగా 34కు పెరుగుతున్నాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తొమ్మిది కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించుకున్న మరుసటి రోజే మరో ఎనిమిది కాలేజీల ఏర్పాటుకు పరిపాలన అనుమతుల మంజూరు చేసేలా అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.

చదవండి: Gold Medal in Medical Exams: వైద్య ప‌రీక్ష‌ల్లో బంగారు ప‌త‌కం సాధించిన యువ‌తి

నారాయణపేట్, ములుగు, మెదక్‌లలో ఏర్పాటు చేసే మెడికల్‌ కాలేజీల కోసం రూ. 180 కోట్ల చొప్పున.. గద్వాల, నర్సంపేట, యాదాద్రిలలో కాలేజీలకు రూ.183 కోట్ల చొప్పున, కుత్బుల్లాపూర్‌ కాలేజీకి రూ.182 కోట్లు, మహేశ్వరం కాలేజీకి రూ. 176 కోట్లు కేటాయించినట్టు మంత్రి తెలిపారు. ఈ మేరకు కాలేజీలు, హాస్టల్‌ భవనాల నిర్మాణాన్ని వేగంగా చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ 8 కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసి, ఎంబీబీఎస్‌ తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Published date : 19 Sep 2023 05:23PM

Photo Stories