Skip to main content

Himabindu Singh: మెడికల్‌ కాలేజీలో వీడియో చిత్రీకరణపై కేసు

గోదావరిఖని: ఖని మెడికల్‌ కళాశాలలో ఓపార్టీకి అనుకూలంగా వీడియో చిత్రీకరణపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్‌ సీఐ ప్రమోద్‌రావు న‌వంబ‌ర్ 8న‌ రాత్రి తెలిపారు.
Case Registered for Party Video, Khani Medical College Incident, case of filming a video in a medical college, Godavarikhani One Town CI Pramod Rao,

చిత్రీకరణ అంశంపై ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేయడంతో సీరియస్‌గా తీసుకున్నారు. ఎన్నికల అధికారులు కళాశాలకు చేరుకుని ఇప్పటికే విచారణ జరిపారు. కాంట్రాక్టు శానిటేషన్‌ సూపర్‌వైజర్‌, సెక్యూరిటీ సిబ్బందిని విధుల్లోంచి తొలగించాలని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

చదవండి: Jobs: స్టాఫ్‌ నర్సుల భర్తీకి రెండో విడత కౌన్సెలింగ్‌కు సన్నాహాలు

కొందరు వ్యక్తులు ప్రిన్సిపాల్‌ అనుమతిలేకుండా ఎలక్షన్‌ కోడ్‌ నిబంధనలకు విరుద్ధంగా వేరే వ్యక్తులను తీసుకొచ్చి ఓ పార్టీకి అనుకూలంగా వీడియో చిత్రీకరించారని, సోషల్‌ మీడియాలో పోస్టు చేశారని మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ హిమబిందుసింగ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు.

Published date : 10 Nov 2023 10:18AM

Photo Stories