Skip to main content

IIIT Ongole: టిపుల్‌ ఐటీ విద్యార్థికి రూ.22 లక్షల ప్యాకేజీ

ప్రకాశం జిల్లా సంతనూతలపాడులోని ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి పంతగాని అజయ్‌ రూ.22 లక్షల ప్యాకేజీతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగానికి ఎంపికయ్యారు.
twenty two lakh package for IIIT ongole student Ajay Panthagani
విద్యార్థి పంతగాని అజయ్‌కు ఆఫర్‌ లెటర్‌ను అందజేస్తున్న డైరెక్టర్‌ జయరామిరెడ్డి

బెంగళూరు కేంద్రంగా నడుస్తున్న సింగపూర్‌కు చెందిన గోజెక్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి ఆఫ్‌లైన్ లో దరఖాస్తు చేసుకున్న అజయ్‌.. ఏడాదికి రూ.22 లక్షల జీతంతో ఉద్యోగానికి ఎంపికైనట్లు కంపెనీ వారు ఆఫర్‌ లెటర్‌ను పంపారు. దీనిని ట్రిపుల్‌ ఐటీ కళాశాల డైరెక్టర్‌ బి.జయరామిరెడ్డి చేతుల మీదుగా విద్యార్థి అజయ్‌ మే 10న కళాశాలలో అందుకున్నారు. కాగా, ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ జయరామిరెడ్డి మాట్లాడుతూ.. 2021–22 విద్యాసంవత్సరంలో ఒంగోలు ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో పలు కంపెనీలు నిర్వహించిన రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌లలో మొత్తం 774 మంది తమ విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు తెలిపారు. మరో 125 మంది విద్యార్థులు ఇప్పటికే ఇంటర్వూ్యలు పూర్తి చేసుకుని, ఆఫర్‌ లెటర్ల కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు.

Sakshi Education Mobile App
Published date : 11 May 2022 12:41PM

Photo Stories