Skip to main content

Job Mela: జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలి

బాన్సువాడ రూరల్‌: అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డిల ఆ ధ్వర్యంలో బాన్సువాడలో సెప్టెంబ‌ర్ 27న నిర్వహించ నున్న జాబ్‌మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని బాన్సువాడ ఎంపీపీ నీరజా వెంకట్రాంరెడ్డి కోరారు.
Job Mela
జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలి

 సెప్టెంబ‌ర్ 23న‌ ఆమె బోర్లం క్యాంపు లో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్‌ నాయకుల తో కలిసి జాబ్‌మేళా కరపత్రాలను, వాల్‌పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. కరపత్రాలపై ఉన్న క్యూ ఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. బీర్కూర్‌ రోడ్‌లోని ఎస్‌ఎంబీ ఫంక్షన్‌ హాల్‌ లో జరిగే ఈ కార్యక్రమానికి నిరుద్యోగ అభ్యర్థులు స్టడీ సర్టిఫికేట్‌, ఆధార్‌కార్డు, రెస్యూమ్‌, ఎక్స్‌పీరియన్స్‌ ధ్రువపత్రాలు తీసుకు రావాలన్నారు. సర్పంచ్‌ నాన్కు పీర్యానాయక్‌, నాయకులు రాజేశ్వర్‌గౌడ్‌, శ్రీనివాస్‌రెడ్డి, నర్సింలు,తదితరులు పాల్గొన్నారు.

చదవండి:

Job Fair: 27న జాబ్‌ మేళా

ఐటీ ఉద్యోగాలకు కేరాఫ్‌ పాలమూరు

Published date : 25 Sep 2023 04:28PM

Photo Stories