Skip to main content

Skill Development: పరిశ్రమల ఆవరణలోనే విద్యార్థులకు నైపుణ్య శిక్షణ

సాక్షి, అమరావతి: ‘ఇండస్ట్రీ కస్టమైజ్డ్‌ స్కిల్‌ ట్రైనింగ్స్‌ అండ్‌ ప్లేస్‌మెంట్స్‌ (ఐసీఎస్‌టీపీ)’ ప్రోగ్రామ్‌ ద్వారా పరిశ్రమల ఆవరణలోనే విద్యా­ర్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్టు ఆంధ్ర‌ప్ర‌దేశ్ నైపుణ్యాభి­వృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్‌ కుమార్‌ చెప్పారు.
ICSTP Skill Training and Placements Program   ICSTP Programme   Skill Training in Industries   Skill training for students in industrial premises   Andhra Pradesh Skill Development Department

విద్యార్థి దశలోనే నైపుణ్యాలు అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే స్కిల్‌ కాస్కేడింగ్‌ సిస్టమ్‌ను అమలు చేస్తోందన్నారు. ఈ మేరకు జ‌నవ‌రి 9న‌ విశాఖలో ఇండస్ట్రీ స్టేక్‌ హోల్డర్స్‌ వర్క్‌షాప్‌లో నైపుణ్యాభివృద్ధి సంస్థ, రీటైలర్స్‌ అసోసియేషన్‌ స్కిల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సంస్థతో శిక్షణపై అవగాహన ఒప్పందం చేసుకుంది.

ఆయన మాట్లా­డుతూ పరిశ్రమలకు డిమాండ్‌ ఉన్న కోర్సుల్లో 30–45 రోజులపాటు శిక్షణ ఇచ్చి అక్కడే ఉపాధి కల్పిస్తామన్నారు. భవిష్యత్తులో తయారీ పరిశ్ర­మలోనే కాకుండా ఐటీ, సేవా రంగాల్లో కూడా శిక్షణ ఇస్తామన్నారు.

చదవండి: Bridge Course: బ్రిడ్జి కోర్సు శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రభుత్వ సల­హా­దారు (ఉద్యోగ మేళా, శిక్షణ) జి.శ్రీధర్‌­రెడ్డి మాట్లా­డుతూ పేద విద్యార్థులను ప్రపంచ స్థా­యి ఉద్యోగాల్లో నిలబెట్టేలా సీఎం వైఎస్‌ జగన్‌ 192 స్కిల్‌హబ్స్, 26 స్కిల్‌ కాలేజీలను ప్రవేశపె­ట్టారన్నారు. వీటి ద్వారా ఏటా రూ.50 వేలకు పైగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామన్నారు.

జాబ్‌ క్యాలెండర్‌ ద్వారా ప్రతి నెలా ప్రతి జిల్లాలో 2 జాబ్‌ మేళాలు ఏర్పా­టు చేసి 30 వేల మందికి పైగా ఉద్యోగావకా­శాలు కల్పించామ­న్నారు. త్వరలోనే స్కిల్‌ వర్సి­టీని కూడా అందు­బాటులోకి తీసుకొస్తామ­న్నారు. నైపు­ణ్యాభి­వృ­ద్ధి సంస్థ ఎండీ వి.వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ యువతకు నైపుణ్యంతో కూడిన శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి చిత్తశుద్ధితో పని చేస్తున్నట్టు చెప్పారు.  
చదవండి: National Education Policy: విద్యార్థులకు వృత్తివిద్య నైపుణ్యం

sakshi education whatsapp channel image link

Published date : 10 Jan 2024 01:37PM

Photo Stories