Dr Angamuthu: యువత ఉపాధి శిక్షణకు పోర్టు సాయం
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువజన దినోత్సవాన్ని పోర్టులో జనవరి 12న ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.64.38 లక్షల చెక్కును సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ మారీటైమ్ అండ్ షిప్‌బిల్డింగ్(సెమ్స్) అధికారులకు అందజేశారు. ఈ నిధులతో కొరియర్ సూపర్ వైజర్ ఆపరేషన్స్, వేర్ హౌస్ ఎగ్జిక్యూటివ్, వేర్ హౌస్ పికర్, ఇన్వెంటరీ కంట్రోలర్ , సీఎన్‌సి ఆపరేటర్, వెర్టికల్ మెషీనింగ్ సెంటర్, ఎంఎంఏడబ్యూ, స్వామ్ వెల్డర్, అసిస్టెంట్ ఎలక్ట్రిషియన్ తదితర కోర్సులలో నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు వినియోగిస్తామని సెమ్స్ అధికారులు తెలిపారు.
చదవండి: Mega Job Mela: జాబ్‌మేళా ద్వారా నిరుద్యోగులకు ఉపాధి
శిక్షణా కాలం మూడు నెలల పాటు ఉంటుందని పోర్టు చైర్మన్ తెలిపారు. సెమ్స్‌తో కలిసి విశాఖపట్నం పోర్టు అథారిటీ నిర్వహిస్తున్న ఈ ఉచిత శిక్షణను యువత సద్వినియోగం చేసుకోవాలని పోర్టు చైర్మన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోర్టు డిప్యూటీ చైర్మన్ దుర్గేష్ కుమార్ దూబె, ఎఫ్‌ఏ అండ్ సీఏఓ శరగడం శివకుమార్ , సెమ్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.