Perfect Tech Resume Tips- జాబ్ ట్రయల్స్‌లో ఉన్నారా? రెజ్యుమేలో ఆ తప్పులు మాత్రం చేయకండి
ఉద్యోగానికి అప్లై చేయాలన్నా, ఇంటర్వ్యూకి సెలక్ట్ అవ్వాలన్నా అన్నింటి కంటే ముఖ్యమైనది రెజ్యూమే. రెండు పేజీల కాగితం మనం ఏంటో సదరు కంపెనీకి పరిచయం చేస్తుంది. మనలోని టాలెంట్‌ను తెలియజేస్తుంది. దాదాపు సగానికి పైగా కంపెనీలు మన రెజ్యూమేలో ఉన్న విషయాల ఆధారంగానే మనల్ని సంప్రదిస్తాయి.
రెజ్యుమేలో ఇవి తప్పనిసరి
అందుకే అభ్యర్థులు రెజ్యూమే ప్రిపేర్ చేసేటప్పుడు ఓ ఫార్మట్‌లో సిద్ధం చేసుకోవాలి. రెజ్యూమే రూపొందించిన విధానం కూడా మీ ఉద్యోగ అవకాశాల్ని ప్రభావితం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఇంటర్వ్యూ చేసే వ్యక్తిని టెక్నికల్ రెజ్యూమేతో ఎలా ఆకట్టుకోవాలి? రెజ్యూమేలో తప్పనిసరిగా ఉండాల్సిన అంశాలేంటి? వంటి వివరాలను తెలుసుకుందాం.
రెజ్యుమే.. ఇలా సింపుల్‌గా
ముందుగా రెజ్యూమె అన్నది వీలైనంత సింపుల్‌గా ఉండాలి. పేజీల కొద్దీ రాయడం వల్ల ఫలితం ఉండదు. చాలామంది రిక్రూటర్లు రెజ్యూమే చూసేందుకు కేవలం 30 సెకన్లు మాత్రమే కేటాయిస్తున్నట్లు ఓ తాజా అధ్యయనం తెలిపింది. కాబట్టి సీవీ అనేది ఒకటి, రెండు పేజీల్లోనే క్లుప్తంగా ఉండాలి. అందులోనే వివరాలన్నింటిని క్లియర్‌గా పొందుపరచాలి.
వాటిని హైలైట్ చేయండి
రెజ్యూమే రాయడానికి ఓ ఫార్మాట్ ఉంటుంది. మీ పేరు, కాంటాక్ట్ వివరాలు, విద్యార్హతలు, అనుభవం, స్కిల్స్, విజయాలు, స్కాలర్‌షిప్స్, సర్టిఫికేషన్స్… ఇలా ఈ ఆర్డర్‌లోనే రెజ్యూమె ప్రిపేర్ చేయాలి. అప్లై చేస్తున్న ఉద్యోగానికి తగిన నైపుణ్యాల గురించి సీవీలో ప్రస్తావించాలి. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మీ రెజ్యూమే పూర్తిగా చదివే అవకాశం ఉండదు కాబట్టి మీ టెక్నికల్ స్కిల్స్‌ను హైలైట్ చేస్తూ ప్రత్యేకంగా ఫ్రేమ్ చేయండి.
రెజ్యుమేలో ముఖ్యమైనది ఇదే
టెక్నికల్ స్కిల్స్‌కు సంబంధించిన విషయాలను రెజ్యూమేలో ప్రస్తావించేటప్పుడు కొన్ని పదాలను చేర్చాలి. ఉదాహరణకు.. యాక్టివేటెడ్”, “డిజైన్డ్”, “ఆర్గనైజ్డ్”, “డెవలప్డ్”, “ఇనిషియేటెడ్”, “యుటిలైజ్డ్”, “డెమోన్‌స్ట్రేటెడ్”, “ఇన్వాల్వ్డ్” వంటి పదాలను సరైన విధంగా, అర్థవంతంగా రెజ్యూమేలో పొందుపర్చండి.
టెక్నికల్ స్కిల్స్ తర్వాత రెజ్యూమెలో అన్నింటికంటే ముఖ్యమైనది ప్రీవియస్ ఎక్స్‌పీరియెన్స్. గతంలో మీరు ఎక్కడ పనిచేశారు? ఏ విభాగంలో మీకు ఎక్స్‌పీరియెన్స్ ఉంది అనేది చాలా ముఖ్యం. వీటిని 3 లేదా 4 లైన్లలోనే బ్రీఫ్‌గా పొందుపరచండి. కుదిరితే వాటిని పట్టికలో లేదా పాయింట్ల రూపంలో( (బుల్లెట్ పాయింట్లను ఉపయోగించి)సరళంగా వివరించండి.
ఉదాహరణకు ఈ విధంగా..
ఆపరేటింగ్ సిస్టమ్స్: Windows, UNIX, LINUX
లాంగ్యేజీ: JAVA, విజువల్ బేసిక్, C/C++, Perl
డేటాబేస్: ఒరాకిల్, MS SQL సర్వర్
నెట్‌వర్కింగ్: TCP/IP, LAN/WAN
ఇందులో మీకు నిజంగా పట్టున్న ప్రోగ్రామ్‌లు/అప్లికేషన్‌ల గురించే పొందుపర్చండి. మీకు తెలియని అంశాలను చేర్చవద్దు ఇంటర్వ్యూలో రెజ్యూమే ఆధారంగానే ప్రశ్నలు అడుగుతారు కాబట్టి నిజాయితీగా మీకు తెలిసిన అంశాల గురించే రెజ్యూమేలో ప్రస్తావించాలి.
రెజ్యుమేలో.. ఇలాంటి తప్పులు చేయకండి
రెజ్యూమ్‌లో ఎట్టి పరిస్థితుల్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసుకోవాలి. ఇతరుల రెజ్యూమ్‌ను కాపీ చేయకుండా వీలైనంత వరకు సొంతంగా ప్రీపేర్ చేసుకోవడం ఉత్తమం. లేదా మీరు రిఫరెన్స్ తీసుకున్న రెజ్యూమేలో మీకు తగ్గట్లుగా కొన్ని మార్పులు అయినా చేసుకోవాల్సి ఉంటుంది. సరైన కమ్యూనికేషన్ కోసం అడ్రస్, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీలు కరెక్ట్‌గా ఇవ్వాలి.
ఇంటర్వ్యూలో అలాంటి సమాధానాలు వద్దే వద్దు
చివరగా ఉద్యోగం సాధించాలన్న ఉద్దేశంతో అవాస్తవాలు, అబద్దాలను రెజ్యూమేలో రాయకూడదు. డాక్యుమెంట్లు, రిఫరెన్సులు, ఎక్స్‌పీరియెన్స్, స్కిల్స్ విషయంలో నిజాయితీగా ఉండాలి.వీటితోపాటు చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్, కరెంట్ అఫైర్స్‌పై పట్టు, టెక్నాలజీ పరంగా అప్‌డేట్‌గా ఉన్న విషయాన్ని ఇంటర్వూయర్‌కు రెజ్యూమ్ ద్వారా తెలిసేలా చేయాలి.