Job Mela: రిలయన్స్ జియోలో 50 ఉద్యోగాల భర్తీకి జాబ్‌మేళా
Sakshi Education
సంగారెడ్డి టౌన్: జిల్లా ఉపాధిశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 5న జాబ్‌మేళాను నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వందన జనవరి 3న ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రిలయన్స్ జియో టీం కంపెనీలో 50 ఉద్యోగాల భర్తీకి జనవరి 5న ఉదయం 11 గంటల నుంచి 2గంటల వరకు సంగారెడ్డి బైపాస్ రోడ్డు పక్కన ఉన్న పాత వెలుగు ఆఫీస్ జిల్లా ఉపాధి కార్యాలయ ప్రాంగణంలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు.
చదవండి: Jio Space Fiber: జియో ఉపగ్రహ ఆధారిత గిగాబిట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్
అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30ఏళ్ల లోపు ఉండాలని సూచించారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డిప్లమా విద్యార్హతలు ఉన్నవారు అర్హులన్నారు.
వేతనం రూ.10,500 నుంచి 21,000 వరకు ఉంటుందని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 5న నిర్ణీత సమయంలోపు విద్యార్హతల ధ్రువపత్రాలు, ఎస్‌ఎస్సీ మెమో, ఆధార్‌కార్డు, కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ల జిరాక్స్ పత్రాలతో నేరుగా జాబ్‌మేళాకు హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఫోన్ నెంబర్ 08455271010ను సంప్రదించవచ్చన్నారు.
Published date : 05 Jan 2024 09:28AM